Loksabha polls 2024: కేసీఆర్.. స్థాయిని మరిచి అబద్దాలు మాట్లాడుతున్నారన్న భట్టి
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:35 PM
Telangana: పదేళ్లు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కూసుమంచిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయని ఆయన ఈరోజు మాట్లాడుతున్నారన్నారు.
ఖమ్మం, ఏప్రిల్ 30: పదేళ్లు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కూసుమంచిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భట్టి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయని ఆయన ఈరోజు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రెండు వందల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, రూ.500 కే గ్యాస్ పథకాలు అమలు చేశామని తెలిపారు. రైతులపైన కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందన్నారు. తాము వచ్చిన మూడు నెలల్లోనే రైతులకు ఇన్సూరెన్స్ కట్టించామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం (BRS Government) విద్యార్థుల మెస్ బిల్లులు కట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని చెప్పారు.
TS News: రాహిల్‌ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీకునే జీతాలు ఇస్తున్నామన్నారు. సిగ్గులేకుండా కరెంటు పోతుందని మాజీ ముఖ్యమంత్రి తన స్థాయిని మర్చిపోయి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారన్నారు. రామచంద్రస్వామి సన్నిధిలో పేదలకు ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు వేలు ఇళ్ళు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇస్తామన్నారు. ఈ దేశ సంపదను వారికి అనుకూలంగా ఉన్న వారికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపి దేశాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: నకిలీ పత్రాలతో రూ. 3.13 కోట్ల మోసం..
Chandrababu: మారీశుడు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొందాం.. వైసీపీ కుట్రలను సాగనివ్వం
Read Latest Telangana News And Telugu News
10th ఫలితాల కోసం క్లిక్ చేయండి...