Home » Bhatti Vikramarka
చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలనే ‘హైడ్రా’ కూల్చివేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలోని 25 వేల మంది పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించే బెస్ట్ అవేలబుల్ స్కూల్స్(బీఏఎస్) పథకానికి నిధులను విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు
సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల రీస్ట్రక్చరింగ్‌కు సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
Telangana: హైదరాబాద్ హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) అని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారన్నారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.
టీ-ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు రూ.300కే ఫైబర్ కనెక్షన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు మాట్లాడడం సిగ్గుచేటని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
పోలీసులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులు అన్ని జిల్లాల ఉద్యోగులకు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్కను డిమాండ్ చేశారు.
Telangana: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన సమీకృత గురుకులాలకు అవసరమైన భూములను సేకరించాలని, త్వరితగతిన డిజైన్లను పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.
కులగణన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.