Share News

Bhatti Vikramarka: ఆరోగ్య బీమాను చౌకగా అందించాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:25 AM

సీనియర్‌ సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని, మిగతా వారికి 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క జీఎస్టీ మండలికి సూచించారు.

Bhatti Vikramarka: ఆరోగ్య బీమాను చౌకగా అందించాలి

  • అది ప్రభుత్వాల బాధ్యత.. జీఎస్టీ మండలి భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని, మిగతా వారికి 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క జీఎస్టీ మండలికి సూచించారు. ప్రజలందరూ తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమాను పొందేలా చేయడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ లభించాలంటే బీమా ప్రీమియంపై పన్ను మినహాయించాల్సి ఉంటుందని అన్నారు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన 54వ జీఎస్టీ మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టిపాల్గొన్నారు. గ్రూప్‌ బీమా, కుటుంబ బీమా పథకాలపై పన్నులను ఎంతమేర విధించాలన్న నిర్ణయంపై ఏర్పాటు చేసే మంత్రుల బృందంలో తాను ఉంటానని భట్టి చెప్పారు. జీఎస్టీకి కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌ను కూడా కలపాలన్నారు. ఈ విషయంలో కూడా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - Sep 10 , 2024 | 04:25 AM