Home » BRS
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్‌రావు అన్నారు.
లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది.
Lagacharla Incident: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీరియస్ అయిన ఎన్హెచ్ఆర్సీ.. ఆ ఇద్దరికీ నోటీసులు పంపించింది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చింది. ఈ సమావేశాలు ఎప్పుడు మొదలు కానున్నాయి? వీటిల్లో ఏయే అంశాలు హైలైట్ కానున్నాయో ఇప్పుడు చూద్దాం..
Telangana High Court: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరుమర్తి రాజు బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గాంధీపై బీఆర్ఎస్ మేడ్చజ్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేసిన వాఖ్యలను బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఖండించారు.
కాాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. భూములును ఆక్రమించిన వారిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టింది.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌సంస్థలు దివాలా తీశాయని, వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి సతమతమవుతున్నాయని టీజీఎస్పీడీసీఎల్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ ఆరోపించారు.
లగచర్లలో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కీలక కుట్రదారుడని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు చెప్పారు.