Share News

Kokapet Hill: నియోపోలీస్‌ చౌరస్తా వద్ద నిరుద్యోగుల ఆందోళన

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:35 AM

కోకాపేట్‌ గుట్టలను నియోపోలీస్‌ పేరుతో వేలంపాటలో అమ్ముకొని బీఆర్‌ఎస్‌ పార్టీ నాశనం చేసిందని, ఆ వేలాన్ని రద్దు చేసి వాటిని కాపాడాలని కొంతమంది నిరుద్యోగులు కోకాపేట్‌ గుట్టపై మెరుపు ధర్నా చేశారు.

Kokapet Hill: నియోపోలీస్‌ చౌరస్తా వద్ద నిరుద్యోగుల ఆందోళన

నార్సింగ్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : కోకాపేట్‌ గుట్టలను నియోపోలీస్‌ పేరుతో వేలంపాటలో అమ్ముకొని బీఆర్‌ఎస్‌ పార్టీ నాశనం చేసిందని, ఆ వేలాన్ని రద్దు చేసి వాటిని కాపాడాలని కొంతమంది నిరుద్యోగులు కోకాపేట్‌ గుట్టపై మెరుపు ధర్నా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వీరంతా గంటపాటు నియోపోలీస్‌ గుట్టపై ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంచె గచ్చిబౌలి భూముల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ కంపెనీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీమంత్రి కేటీఆర్‌ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.


బీఆర్‌ఎస్‌ హయాంలో కోకాపేట్‌ భూములను వేలం వేసినప్పుడు పర్యావరణంపై లేని ప్రేమ.. కంచె గచ్చిబౌలి భూములపై ఎందుకని వారు ప్రశ్నించారు. కోట్లాది రూపాయల ముడుపులు తీసుకొని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు భూములను కట్టబెట్టారని ఆరోపించారు. నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన కోకాపేట్‌ నియోపోలీస్‌ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ఈకో పార్క్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:35 AM