Home » BRS
లగచర్లలో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కీలక కుట్రదారుడని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌కు వచ్చేది అయితే ఒట్లు.. లేదంటే తిట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బుధవారం నాడు మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట మండలం కురుమూర్తి స్వామి ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. కేటీఆర్ కుట్రలను గమనిస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై శాసనమండలి సభ్యుడు శంబిపూర్ రాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేరు పెట్టుకున్న గాడ్సే అని అన్నారు. గాంధీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు.
లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం బీఆర్ఎస్ను కోరినట్టు తెలిసింది. ఫార్మా విలేజ్‌కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్త కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్ఎస్ అందించినట్టు సమాచారం.
కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు సక్సెస్ ఫుల్‌గా ప్రజల్ని మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారని, పది నెలల రేవంత్ పాలనలో అందరి కడుపు కొట్టారని హరీష్‌రావు ధ్వజమెత్తారు.
అన్ని వ్యవస్థలను స్తంభింపజేసి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని, దాని ద్వారా ప్రజల ఆస్తులను గుర్తించి వాటిని కొల్లగొట్టారని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే లగచర్లలో అమాయక గిరిజన రైతుల్ని రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆరోపించారు.
తెలంగాణలోని లగచర్లలోనూ మణిపూర్ వంటి పరిస్థితే ఉందని, అక్కడి గిరిజనుల గోడు దేశమంతా వినాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కడం లేదని, అందుకే వారి సమస్యను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చామని అన్నారు.
మాజీ మంత్రి హరీష్‌రావు తన ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్లను ట్యాప్ చేయించాడని సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్ ఆరోపించారు.