MP Laxman: రిజర్వేషన్ల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:20 PM
MP Laxman: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు.

ఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా అత్యధిక స్థానాల్లో తాము గెలుస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. 37 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలకు అధ్యకుల ఎంపిక జరిగిందని అన్నారు. సగం మేర రాష్ట్రాల అధ్యక్షుల జాతీయ అధ్యక్షుడి ప్రకటన జరుగుతుందని చెప్పారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీ వేదికగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. 37 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలకు మాత్రమే అధ్యక్షుడి ప్రకటన జరిగిందని గుర్తుచేశారు. కుంభమేళా, ఢిల్లీ ఎన్నికలు, పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి.. కాబట్టే తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక ఆలస్యం అవుతుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని అన్నారు. అనుభవంతో సహా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు. అనుభవంతో సహా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని అధ్యక్ష ప్రకటన ఉంటుందని చెప్పారు. ఏప్రిల్‌లోగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త, పాత అంటూ ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ అధ్యక్ష ఎన్నికపై సంస్థాగతంగా చర్చ జరుగుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, లోక్‌సభ సమావేశాలు రాష్ట్ర ప్రజలను ఆలోచింప చేస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు పరచకుండా విభజన రాజకీయాలకు కాంగ్రెస్ తెరదీస్తుందని విమర్శించారు. కర్ణాటకలో మతపరమైన రిజర్వేషన్‌లకు తెరలేపారని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారన్నారు. కుల, మత, ప్రాంతీయ, విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలను కాంగ్రెస్ చేస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
ముస్లింల ఓట్ల కోసం విభజన రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. బీసీలకు మొండిచేయి చూపుతూ వారిని 46 శాతానికి తగ్గించి ముస్లింలను 10 శాతం బీసీల్లో చేర్చారని చెప్పారు. గ్యారెంటీలు , 420 హామీల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి రిజర్వేషన్ల అంశం తెరమీదకి తెచ్చారని ధ్వజమెత్తారు. దేశానికి రోల్ మోడల్, రోడ్ మ్యాప్ అన్నారని చెప్పారు. ముస్లింలను బీసీల్లో చేర్చడమేనా కాంగ్రెస్ రోడ్ మ్యాప్, రోల్ మోడలా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
బీసీలు చైతన్యం అవుతున్నారని.. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రతి పక్షాలు డీలిమిటేషన్‌ను ఆలస్యం చేయాలని చూస్తున్నాయని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్, డీలిమిటేషన్‌ను కూడబలుక్కుని కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతలు మద్దతునిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగైందని చెప్పారు. రుణమాఫీ, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలు లేవనెత్తకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత ధూషణలకు దిగిందని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టి పాలన అందించే పరిస్థితికి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
High Court: ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
Metro Rail: రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Read Latest Telangana News and Telugu news