CM Revanth Reddy: సీఎం రేవంత్ హాట్ కామెంట్స్.. ఒక్క సంతకంతో ఆ పని చేస్తా..
ABN , Publish Date - Mar 29 , 2025 | 08:06 PM
CM Revanth Reddy: ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయని… మీరు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చిట్టీ రాసిస్తే చాలు తాను కొడంగల్‌కు వచ్చి అన్నీ సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి మాటిచ్చారు.

కొడంగల్: తెలంగాణను పాలించే శక్తిని కొడంగల్ ప్రజలు తనకు ఇచ్చారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందన్న బాధ ఉండొచ్చు..వాళ్లను పట్టించుకోవద్దని అన్నారు. తానేం చేస్తానో… ఏం చేయనో... మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని చెప్పారు. ఇవాళ(శనివారం) కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు భివృద్ధి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
కొడంగల్‌లో ముస్లింల అభివృద్ధికి.. ఎమ్మెల్యే నిధుల నుంచి 25శాతం మంజూరు చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయని… మీరు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదని అన్నారు. చిట్టీ రాసిస్తే చాలు తాను కొడంగల్‌కు వచ్చి అన్నీ సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే సాధ్యం..
అలాగే వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని తన నివాసంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ జిల్లా సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను అవమానించడం.. గాంధీని హత్య చేసిన వారిని ప్రోత్సహించేలా మాట్లాడిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. దేశంలో ఇంత మంది పదవులు అనుభవిస్తున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమని ఉద్ఘాటించారు. దళిత గిరిజన ఆదివాసీ వెనకబడిన వారంతా సమానమనే స్పూర్తి అంబేద్కర్‌దని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారు..
‘మన కళ్ల ముందు కనిపించే దేవుడు బాబా సాహెబ్ అంబేద్కర్. పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం ఉంటుందని... అలాంటి అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించడం దారుణం. అందుకే ఇలాంటి వారిని.. వారి మాటలను ఖండించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఇచ్చిన పిలుపుతో ఈ కార్యక్రమం చేపట్టాం. మీరు ఆశీర్వదించి ఆదరించినందుకే నేను సీఎంగా ఉన్నా. కొడంగల్‌లో ఇంతకు ముందు ఎంత మంది ఎమ్మెల్యేలుగా ఉన్నా.. పెద్ద పదవి ఇవ్వలేదు.. అందుకే అన్ని విధాలుగా కొడంగల్ వెనుకబడి పోయింది. సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వేల్‌కు నిధులు తీసుకుని పోవాలని బీఆర్ఎస్ నేతలు కలలు కన్నారు. కొద్ది మంది అమాయకులను రెచ్చగొట్టి వ్యతిరేకత చూపిస్తున్నారు. వారు ఇచ్చిన పరిహారం కన్నా ఎక్కువ పరిహారం.. వారికి ఉద్యోగం వచ్చేలా చేస్తా.. ఒకవేళ స్కిల్ లేకుంటే ట్రైనింగ్ ఇచ్చి..భూములు ఇచ్చిన ప్రతీ ఇంటికీ రెండు ఉద్యోగాలు ఇప్పిస్తా. కొడంగల్‌కు అతి పెద్ద ఉద్యోగం నాకు సీఎం ఉద్యోగం మీరు ఇచ్చారు.. మీకు ఉద్యోగం వచ్చేలా చేసే బాధ్యత నాది’ అని సీఎం రేవంత్‌రెడ్డి మాటిచ్చారు.
కొడంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తా..
‘రూ.10 వేల కోట్లతో కొడంగల్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. ఇంకో రూ.10 వేల కోట్లతో కొడంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తా. నా దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ సాయం చేశా.. కానీ నేను పైసా కూడా ఎవరినీ అడగలేదు. ఎవరూ ఏ పార్టీలో ఉన్నా కొడంగల్ అభివృద్ధికి కలసి రావాలని విజ్ఞప్తి. ఒకప్పుడు రూ.30 వేలకు ఎకరా భూమి ఉన్న కొడంగల్‌లో అభివృద్ధి పనులు జరిగితే కోట్ల రూపాయలకు ఎకరా భూమి అవుతుంది. అప్పుడు అందరూ కోటీశ్వరులవుతారు. కులగణన చేసిన ఘనత మాదే.. దీని వల్ల దామాషా పద్ధతిలో నిధుల కేటాయింపు జరపొచ్చు. మరో పదేళ్లు అధికారం మనదే.. అది కూడా కొడంగల్‌కే ఉంటుంది. కొంతమంది గుంట నక్కల్లా కాచుకు కూర్చున్నారని.. వారి ఆశలు మాత్రం పూర్తి కావు. ఈ పదేళ్లు మన జీవితంలో చాలా ముఖ్యం.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన అజాగ్రత్త వల్ల 2018లో వెనుకబడ్డం.. కానీ నా అదృష్టాన్ని ఎవ్వరూ గుంజుకోలేదు.. నా జీవితంలో ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు.. తర్వాత సీఎంగా అయ్యా. ఈ సారి జరుగబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రతీ రోజూ కొడంగల్ నుంచి ఓ మండలం వారికి అసెంబ్లీ సమావేశాలు తిలకించే విధంగా చేస్తా.. మా తడాఖా ఏంటో చూపించాలని మిమ్మల్ని అసాంబ్లీకి పిలుస్తా. స్థానిక సంస్థల ఎన్నికలు కలిసి కట్టుగా పని చేయాలి. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Mallareddy controversy: మరోసారి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏకంగా హీరోయిన్‌పై..
Betting App Case: బెట్టింగ్ కేసు.. నేడు మరోసారి పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ
Phone Tapping Case: పోలీసుల ముందు శ్రవణ్ రావు.. అడిగిన ప్రశ్నలివే..
Read Latest Telangana News and Telugu News