Buddha Venkanna: జగన్ ఐదేళ్లు నేరస్తులతో పాలన చేశారు
ABN , Publish Date - Feb 06 , 2025 | 02:20 PM
Buddha Venkanna: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జాలే అని ఆరోపించారు. జగన్‌ను ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని బుద్దా వెంకన్న చెప్పారు.

విజయవాడ: జగన్ ఐదేళ్లు నేరస్తులతో పాలన చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇవాళ(గురువారం) టీడీపీ కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌పై బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను మానసిక వైద్య నిపుణులకు చూపించాల్సిందిగా ఆయన భార్య భారతిని కోరుతున్నామని చెప్పారు. 30 సంవత్సరాలు తానే సీఎం అనే భ్రమలో జగన్ ఉన్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.
జగన్ ఓడిపోయి 7 నెలలు కాలేదు అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారని ఆక్షేపించారు. వైసీపీ నాయకులే జగన్ మాటలకు విస్తుపోతున్నారని అన్నారు. అధికారంలో ఉండగా కార్యకర్తలు జగన్‌కు కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి గంటల తరబడి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని బుద్దా వెంకన్న విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి భూమి అయినా కబ్జాకు గురైందా? అని ప్రశ్నించారు. జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జాలే అని ఆరోపించారు. జగన్‌ను ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చెప్పారు. దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలని అన్నారు. జగన్ పాలనలో అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తున్నామని, వైసీపీ నేతలా మాదిరిగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం లేదని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి జగన్ అబద్ధాలు మాట్లాడవద్దని అన్నారు. జగన్ 2.0 అంటే ఆ 11 సీట్లు కూడా ఉండవని బుద్దా వెంకన్న విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP: వైసీపీ నేత అరాచకం.. ఏకంగా కిడ్నాప్ చేసి.. ఏం చేశారంటే..
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అస్వస్థత
ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన
Government Hospitals: రోగుల సంతృప్తే ప్రధానం
Read Latest AP News and Telugu News