Home » CBI Court
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్‌లో(NEET Paper Leak) ఇప్పటికే కీలక నిందితులు అరెస్ట్ అయ్యారు. అయితే తనను సీబీఐ అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన గంగాధర్.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అదుపులోకి తీసుకుంది. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ(NEET-UG 2024) పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం సుదీర్ఘంగా విచారించింది. అనంతరం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మొదట దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు ఇవాళే విచారణ చేపట్టి వాయిదాను పొడగించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
Andhrapradesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్‌ను వేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం (జూలై 1) ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.
నీట్ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్ చేసింది.
రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్-యూజీ, యూజీసీ-నెట్ ప్రవేశ పరీక్షల లీక్ ...
యజమానుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయంగా వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌పై సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.