Home » Chandrababu Naidu
కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా?
తమకు నచ్చని అధికారుల విషయంలో గత జగన్ సర్కార్ చేసిన అరాచకాలు అంతాఇంతా కాదు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఉన్న 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ విషయంలో గతంలో ఇది జరిగింది.
జగన్ జమానాలో గంజాయికి అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్‌ను మత్తురహితం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన ఈ రక్కసిని అంతం చేసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసులు నడుం బిగించారు.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారీ పవన్ కల్యాణ్. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే లులు గ్రూప్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. కానీ ఆ ప్రభుత్వ వైఖరితో లులు గ్రూప్ తమిళనాడు, తెలంగాణకు తరలిపోయింది.
వచ్చే మూడు నెలల్లో జల్ జీవన్ మిషన్‌ను తిరిగి పట్టాలెక్కించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలన్నారు.
2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. తమకు 40 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయని.. ప్రజలే తమ బలమని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ 39.7 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. కానీ 11 సీట్లకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో..
ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో బుడమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ మహానగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఎడ తెరపి లేకుండా కురిసిన బారీ వర్షాల కారణం వరదలు పొటెత్తడంతో విజయవాడకు ఉహించని నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం కారణం తక్కువ నష్టం జరిగిందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.