Home » Chandrababu
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే రాజధాని అమరావతిలో పున: నిర్మాణ పనులకు శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా తుళ్లూరు మండలం ఉద్దరాయునిపాలెంలోని సీఆర్డీయే కార్యాలయం వద్ద భూమి పూజ నిర్వహించారు. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు ఊపందుకొనున్నాయి.
అదృశ్యమైన 30 మంది మహిళలకు గుర్తించి.. వారిని స్వస్థలాలకు తీసుకు వచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చూట్టింది. విశాఖపట్నంలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా అప్పగించిన వందల కోట్ల విలువైన 15 ఎకరాల భూమి కేటాయింపును సైతం రద్దు చేసింది. ఈ తరహా అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ.. ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ కో తట్టుకో లేకపోతుంది.
సహకార సంఘాలకు ముగ్గురు సభ్యుల నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కట్టుతప్పద్దు. క్రమశిక్షణ మరవొద్దు’ అని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
వ్యక్తిగత అవసరాలకు వాగులు, వంకల్లోని ఇసుకను ఉచితంగా తవ్వుకొని తీసుకువెళ్లడానికి అనుమతించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా, పారిశ్రామిక వేత్తలు వెల్లువలా వచ్చేలా నూతన పారిశ్రామిక పాలసీలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
నిత్యావసర వస్తువల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం సమీక్షించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువల..
ప్రైవేటుపరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలన్నది తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఓపిక పడుతున్నామన్నారు. వారి దురుద్దేశాలు, దుష్ప్రచారాలు తొలుత ఎక్స్పోజ్ చేయాలని చెప్పారు. అయితే వారు మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. కానీ తక్షణ చర్యలు చేపట్టడం సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.