Home » Chennai
కోయంబత్తూరులో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో జీఎస్టీ లోపాలను ఎత్తిచూపిన హోటల్ యజమాని పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వైఖరి గర్హనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీఎస్టీని సరళతరం చేయాలని కోరిన అన్నపూర్ణ గ్రూప్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల క్షమాపణలు చెప్పించుకొన్నారంటూ వైరల్ అయిన వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
బంగ్లాతో టీమ్ ఇండియా టెస్ట్ సీజన్ కోసం స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాడు. ఈ క్రమంలో చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న విరాట్ కట్టుదిట్టమైన భద్రత నడుమ రావడం కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ భారత పర్యటనకు ముందు జట్టుపై భారీ వ్యతిరేకత మొదలైంది. బంగ్లాదేశ్ బహిష్కరణ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, డీఎంకే మంత్రి దురై మురుగన్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాత స్టూడెంట్లు, కొత్త స్టూడెంట్లు అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమైంది. అంతా ఏం జరగనుందోనని అనుకుంటున్న తరుణంలో ఇందులో ఏమీ లేదంటూ ఇద్దరు ప్రముఖలు తేల్చేశారు.
దేశ భవిష్యత్ యువ పట్టభద్రులపైనే ఆధారపడి ఉందని, స్వాతంత్య్రదిన శత వార్షికోత్సవాల్లోపు దేశాన్ని సంపన్న దేశంగా మార్చే బాధ్యత యువతపైనే ఉందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.
నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో... ఏదో ఒక మూల ఆకలితో దీనంగా కనిపించే వృద్ధులు. లాక్డౌన్ సడలింపు సమయంలో వీధుల్లోకి వచ్చి... ఆకలికి తీర్చుకోవడానికి యాచించే దీనులు.
మహిళల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు మంత్రి. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, దివంగత కరుణానిధి మనమడు అనే సంగతి తెలిసిందే. సినిమాల నుంచి క్రమంగా రాజకీయాల్లోకి వెళ్లారు. తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతుగా కృషిచేశారు. దాంతో మంత్రివర్గంలో ఉదయనిధికి చోటు దక్కింది .