Home » Chittoor
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కొత్త పాలక మండలిని నియమించారు. మొత్తం 24 మందితో టీటీడీ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రజలను ఏమార్చి, బ్యాగుల్లోని బంగారు నగలు, సెల్ఫోన్లు అపహరించే ఇద్దరు నిందితులను తిరుపతి క్రైం పోలీసులు(Tirupati Crime Police) అరెస్టు చేశారు. డీఎస్పీ రమణకుమార్ తెలిపిన ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడ(Krishna District Gudivada) మండలానికి చెందిన వేముల శివకుమార్ వృత్తి రీత్యా తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద ఉంటున్నాడు.
శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి తిరుమాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా 31న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
సుమారు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో ముహూర్తాలు రావడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. నవంబరు 12 నుంచి డిసెంబరు 16 వరకు సుమారు 18 ముహూర్తాలు ఉండడంతో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఓ ఇంటివారిని చేసే పనిలో పడ్డారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి(Kanipakam Varasiddhi Vinayaka Swamy) ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్‌ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు. తన పదోన్నతి కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆలయానికి సమర్పించారంటూ సోమశేఖర్ గురుకుల్‌పై లాయర్ రవికుమార్ ఆరునెలల క్రితం దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
‘అనవసరంగా చెడ్డపేరు వస్తోంది. ఎమ్మెల్యేగా ఎందుకయ్యామా అని బాధేస్తోంది’ అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి వాపోయారు.
తిరుపతి జిల్లా తిరుచానూరు శిల్పారామంలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు ఇవాళ (శనివారం) నిర్వహించనున్నారు. తిరుపతి క్షేత్రంలో మద్యం, మాంసం లేకుండా తిరుపతి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని ఈ సమావేశంలో స్వామీజీలు డిమాండ్ చేయనున్నారు.
Andhrapradesh: తిరుమలలో రోడ్డును కూడా ఆక్రమించి మరీ శారదా పీఠం మఠం నిర్వాహకులు భారీ భవనాలను నిర్మిస్తున్నారు. చెరువులను కూడా ఆక్రమించేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. టీటీడీ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 20వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Andhrapradesh: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. ఒకేసారి 16 ఏనుగుల గుంపు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంటపొలాలను నాశనం చేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్హత లేకనే మందుల (ఔషధ) దుకాణాలు పెట్టేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యుల సిఫారసు లేకుండా ఇస్తున్న మందులతో రోగుల ప్రాణాల మీదకు వస్తోంది.