Home » Congress
ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న వారిపై చర్యలకు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ కొణతం దిలీప్‌ను సోమవారం హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణలు విమర్శలు గుప్పించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతలు లేవని డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ అంటే ఏమిటో ఈ సర్కార్‌కు చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత, చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసిపి ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు.
లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, రాజయ్య రాజకీయ ప్రత్యర్థులు. రాష్ట్ర విభజనతో రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరూ బీఆర్ఎస్లో చేరారు. ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. అయితే వీరిద్దరి మధ్య చాలాకాలంగా రాజకీయ పోరు నడుస్తోంది. ఇద్దరు నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై సోషల్ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డిపై ఆదివారం కేసు నమోదైందని భూపాలపల్లి జిల్లా కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు.
ఫొటో షూట్ కోసమే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 3 నెలలుంటే అక్కడి సమస్యలు తెలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటే.. 12 గంటల ఉండి ఫొటో షూట్ చేసుకుని వచ్చారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమల దళం రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్ర అంటున్నారని తెలిపారు.
దేశంలో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ రాజకీయంగా ప్రమాదకరమైనవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది.