Home » Cyber Crime
కొత్తవారు పంపిన లింక్లను ఓపెన్ చేయొద్దని, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచించింది. నగరంలో ఇటీవల సైబర్ నేరాలు అధికమయ్యాయి. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుంబిగించింది.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తతతో భారీ సైబర్ మోసం నుంచి ఓ కంపెనీ బయటపడింది. సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు ఓ కంపెనీ అధికారి రూ.1.95 కోట్లు పంపాక జరిగిన మోసాన్ని గుర్తించి సైబర్ సెక్యూరిటీ బృందానికి ఫిర్యాదు చేయడంతో ఆ డబ్బును సైబర్ నేరగాళ్లు విత్డ్రా చేయకుండా నిలువరించగలిగారు.
సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ ఉద్యోగినిని నిండా ముంచేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.23 లక్షలు కొల్లగొట్టారు. దీంతో ఆ రిటైర్డ్ ఉద్యోగిని లబోదిబోమంటున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎవరో అనామకుడు బలయ్యాడనుకుంటే ఏమో అనుకోవచ్చు గాని ఏకంగా విద్యావంతలు, ఉద్యోగులే బలవుతుండడం ఇక్కడ గమనించదగ్గ విషయం.
నకిలీ వివరాలతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన ఓ యువకుడు దాదాపు రూ.8కోట్లు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు మళ్లించిన అతడు ఎట్టకేలకు తనపాపం పండి పోలీసుకు దొరికిపోయాడు. అదుపులోకి తాసుకున్న పొలీసులు తమదైన శైలీలో విచారణ జరిపితే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రతిరోజూ ఎక్కడో ఇకచోట ఈ మోసాలు జరుతుగూనే ఉన్నాయి. పోలీస్ శాఖ ఈ తరహ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పస్తున్నటికీ.. సైబర్ మోసగాళ్లు మాత్రం కొత్తదారులు వెతుకుతూ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.
అమాయకులను బురిడి కొట్టించి డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో అవినీతి అధికారుల ఆటకట్టించే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పేరును కూడా సైబర్ కేటుగాళ్లు వాడేస్తున్నారు.
అమెరికా పౌరులనే లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కాల్సెంటర్ నిర్వాహకురాలు, 62 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
Congress MLA: తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఎమ్మెల్యేకే ఊహించని షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో సైబర్ నేరగాళ్లు చేసిన పనికి ఖంగుతినడం ఎమ్మెల్యే వంతైంది.
ఫేస్బుక్ ప్రొఫైల్(Facebook profile)లో ఉన్న ఫొటోను దుర్వినియోగం చేసి నగరానికి చెందిన వ్యాపారవేత్తను సైబర్ క్రిమినల్స్(Cyber criminals) బురిడీ కొట్టించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ సోదరుడి కొడుకును సిడ్నీ ఎయిర్పోర్టులో ఆపేశామంటూ స్పాట్ వీసా పేరుతో రూ.1.60లక్షలు కొల్లగొట్టారు.
మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అంటూ ఓ వృద్ధుడిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అతడి వద్ద రూ. 1.50 లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత(DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 60 ఏళ్ల వృద్ధునికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.