Share News

Facebook: ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ఫొటోతో ఏమార్చి.. ఏం చేశారో తెలిస్తే..

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:51 AM

ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌(Facebook profile)లో ఉన్న ఫొటోను దుర్వినియోగం చేసి నగరానికి చెందిన వ్యాపారవేత్తను సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) బురిడీ కొట్టించారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మీ సోదరుడి కొడుకును సిడ్నీ ఎయిర్‌పోర్టులో ఆపేశామంటూ స్పాట్‌ వీసా పేరుతో రూ.1.60లక్షలు కొల్లగొట్టారు.

Facebook: ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ఫొటోతో ఏమార్చి.. ఏం చేశారో తెలిస్తే..

- రూ. 1.60 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

- ఇమ్మిగ్రేషన్‌ అధికారుల్లా బురిడీ కొట్టించిన క్రిమినల్స్‌

హైదరాబాద్‌ సిటీ: ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌(Facebook profile)లో ఉన్న ఫొటోను దుర్వినియోగం చేసి నగరానికి చెందిన వ్యాపారవేత్తను సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) బురిడీ కొట్టించారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మీ సోదరుడి కొడుకును సిడ్నీ ఎయిర్‌పోర్టులో ఆపేశామంటూ స్పాట్‌ వీసా పేరుతో రూ.1.60లక్షలు కొల్లగొట్టారు. చివరకు మోసమని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నగరానికి చెందిన 44 ఏళ్ల వ్యాపారికి నాలుగు రోజుల క్రితం ఫేస్‌బుక్‌ మెసేంజర్‌(Facebook Messenger) ద్వారా మెసేజ్‌ వచ్చింది. అందులో అతడి సోదరుడి కొడుకు ఫొటో ఉంది.

ఈ వార్తను కూడా చదవండి: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం


city1.2.jpg

వీసా సాంకేతిక లోపంతో సిడ్నీలో ఎయిర్‌ పోర్టు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని, అక్కడి ఏజెంటుతో మాట్లాడాలని ఆ మెసేజ్‌లోని సారాంశం. దాంతో వ్యాపారి వెంటనే సదరు నంబర్‌కు ఫోన్‌ చేయగా.. మీ సోదరుడి కొడుకు అర్జంట్‌గా స్పాట్‌ వీసా పొందడానికి కొంత డబ్బు ఖర్చు అవుతుందని, వెంటనే చెల్లించాలని, లేదంటే మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి ఏజెంటుగా వ్యవహరించిన వ్యక్తి తెలిపాడు. దాంతో బాధితుడు వెంటనే సదరు బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేశారు. దాంతో అవతలి వ్యక్తి వెస్ట్రన్‌ యూనియన్‌ నకిలీ రసీదు పంపాడు.


city1.3.jpg

ఇది జరిగిన తర్వాత బాధితుడు తన సోదరుడి కొడుకుతో మాట్లాడగా.. తాను ఎయిర్‌పోర్టుకు వెళ్లలేదని, ఎవరూ అదుపులోకి తీసుకోలేదని, ఎవరో తన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ఫొటోను వాడుకొని మిమ్మల్ని మోసం చేసి ఉంటారని చెప్పాడు. దాంతో బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్‌ మీడియాలో వచ్చే మోసపూరితమైన మెసేజ్‌లు నమ్మొద్దని, మెసేజ్‌లు వచ్చిన వెంటనే ప్రొఫైల్‌ ఫొటోలు చూసి మోసపోకుండా ముందుగా క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని డీసీపీ ధార కవిత సూచించారు.


ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు

ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్‌ పార్కులు

ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!

ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2025 | 06:51 AM