Home » Cyclone Michaung
Cyclone Michaung: ‘‘మిచాంగ్’’ తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
Andhrapradesh: మిచాంగ్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారింది. తీవ్ర తుఫాను రేపు (మంగళవారం) నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
Cyclone Michaung: మిచాంగ్ తుఫాన్ రేపు(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కృష్ణా జిల్లా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Cyclone Michaung: మిచాంగ్ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు.
మిచాంగ్(Michaung Cyclone) తుపాన్ ప్రభావంతో తమిళనాడు వణుకుతోంది. తుపాన్ ధాటికి రాజధాని చెన్నై(Chennai)లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.
Andhrapradesh: ‘మిచాంగ్’ తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 220 కిలోమీటర్లు, బాపట్లకు 330 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.