Home » Cyclone
బంగాళాఖాతంలో ఉద్భవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది.
రెమాల్ తుఫాను మరింత తీవ్రం రూపం దాల్చి ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలను తాకనుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష జరిపారు. తుపాను తీవ్రతను తట్టుకునేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు.
'రెమాల్(Remal)' తుపాను ఆదివారం రాత్రి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు విమానాలతోపాటు రైళ్లను కూడా రద్దు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
రీమల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది.
దుబాయి(Dubai)ని భారీ వర్షాలు వణికిస్తున్న వేళ.. అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు యూఏఇలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా దుబాయికి రావాలనే ఆలోచన మానుకోవాలని శుక్రవారం సూచించింది.
ఎడారి నేలను తుపాన్ వణికిస్తున్నాయి. ఏప్రిల్ 15 సాయంత్రం నుంచి తుపాన్(Dubai Cyclone) ధాటికి కురుస్తున్న భీకర వర్షాలతో దుబాయి చిగురుటాకులా వణుకుతోంది. ఆకస్మిక వరదల వల్ల దాదాపు 18 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఆకస్మాత్తుగా వచ్చిన తుఫాను,(Cyclone) వర్షం కారణంగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని అనేక ప్రాంతాలు వినాశనానికి గురయ్యాయి. ప్రధానంగా జల్పైగురి జిల్లా(Jalpaiguri district)లోని పలు ప్రాంతాల్లో తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలుల వల్ల జిల్లా కేంద్రమైన పట్టణంతోపాటు మైనగురి తదితర పరిసర ప్రాంతాల్లో అపార నష్టం జరిగింది.
Andhrapradesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రేపటి (శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు బాబు పర్యటన కొనసాగనుంది.
ప.గో. జిల్లా: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతకు అపారనష్టం సంభవించింది. ఏలూరు జిల్లాలో 68 వేల 55 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.