Jalpaiguri Storm: తుఫాను కారణంగా ఐదుగురు మృతి, 500 మందికి గాయాలు..సీఎం రియాక్ట్
ABN , Publish Date - Apr 01 , 2024 | 09:21 AM
ఆకస్మాత్తుగా వచ్చిన తుఫాను,(Cyclone) వర్షం కారణంగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని అనేక ప్రాంతాలు వినాశనానికి గురయ్యాయి. ప్రధానంగా జల్‌పైగురి జిల్లా(Jalpaiguri district)లోని పలు ప్రాంతాల్లో తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలుల వల్ల జిల్లా కేంద్రమైన పట్టణంతోపాటు మైనగురి తదితర పరిసర ప్రాంతాల్లో అపార నష్టం జరిగింది.
ఆకస్మాత్తుగా వచ్చిన తుఫాను,(Cyclone) వర్షం కారణంగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని అనేక ప్రాంతాలు వినాశనానికి గురయ్యాయి. ప్రధానంగా జల్‌పైగురి జిల్లా(Jalpaiguri district)లోని పలు ప్రాంతాల్లో తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలుల వల్ల జిల్లా కేంద్రమైన పట్టణంతోపాటు మైనగురి తదితర పరిసర ప్రాంతాల్లో అపార నష్టం జరిగింది. ఈ తుఫాను ధాటికి అనేక ఇళ్లు(houses) ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో రాజర్‌హట్, బర్నీష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత చెందగా, 500 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: 200 సీట్లైనా గెలవండి.. చూద్దాం
ఈ ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించారు. రెండు మూడు నిమిషాల వ్యవధిలో ఆదివారం సాయంత్రం వచ్చిన తుఫాను కారణంగా చాలా నష్టం వాటిల్లిందని అన్నారు. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు ఆమె తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. మరణించిన కుటుంబ సభ్యులు, క్షతగాత్రులకు జిల్లా యంత్రాంగం నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తుందని తెలిపారు. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఆమె ఎక్కువగా మాట్లాడలేదు.
ఆ క్రమంలో ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే వెంటనే సీఎం(CM) ఆసుపత్రిని సందర్శించారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు ప్రధాని మోదీ(modi), సంబంధిత అధికారులతో బెంగాల్ సీఎం మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: మ్యాచ్ ఫిక్సింగ్ మోదీని గద్దె దింపుదాం!