Share News

Pharmacy PG Campus: ఆందోల్‌లో జేఎన్‌టీయూ ఫార్మసీ పీజీ క్యాంపస్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:34 AM

సుల్తాన్‌పూర్‌లోని ఆందోల్‌ గ్రామంలో ఫార్మసీ పీజీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది.

Pharmacy PG Campus: ఆందోల్‌లో జేఎన్‌టీయూ ఫార్మసీ పీజీ క్యాంపస్‌

  • 15ఎకరాల భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): సుల్తాన్‌పూర్‌లోని ఆందోల్‌ గ్రామంలో ఫార్మసీ పీజీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఫార్మసీ కళాశాలను మరింత విస్తరించాలన్న జేఎన్‌టీయూ ఉన్నతాధికారుల ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను శుక్రవారం జేఎన్‌టీయూ వీసీ కిషన్‌కుమార్‌ రెడ్డికి.. ఆందోల్‌ ఆర్డీవో పండు అందజేశారు.


ఈ సందర్భంగా క్యాంపస్‌ కోసం ప్రభుత్వం నుంచి భూమి కేటాయించేందుకు సహకరించిన మంత్రి దామోదర రాజనర్సింహాకు వర్సిటీ ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆందోల్‌లో ఫార్మసీ పీజీ క్యాంపస్‌ నిర్మాణానికి రూ.40 కోట్ల వ్యయమవుతుందని, ఆ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి జేఎన్‌టీయూ నుంచి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

Updated Date - Apr 05 , 2025 | 04:34 AM