Share News

AP Politics: రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు.. అదృష్టం వరించేనా..

ABN , Publish Date - Sep 29 , 2024 | 05:20 PM

మోపిదేవి వెంటకరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా.. ఛైర్మన్ ఆమోదం తెలిపారు. మూడు సీట్లలో ఒకటి జనసేనకు మరో రెండు టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటినుంచే రాజ్యసభ సీట్ల కోసం..

AP Politics: రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు.. అదృష్టం వరించేనా..
Nagababu

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నాయకులకు ఈ పదవుల్లో అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో మరికొన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదే సమయంలో ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండటంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి చెందిన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంటకరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా.. ఛైర్మన్ ఆమోదం తెలిపారు. మూడు సీట్లలో ఒకటి జనసేనకు మరో రెండు టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటినుంచే రాజ్యసభ సీట్ల కోసం పలువురు నాయకులు ప్రయత్నం చేసుకుంటుండగా.. టీడీపీ, జనసేన అధిష్టానం మాత్రం రాజ్యసభ సీట్ల విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం పలువురు నేతలు రేసులో ఉండగా.. జనసేన నుంచి ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది.

Somireddy: జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..


జనసేన నుంచి..

జనసేన నుంచి రాజ్యసభ సభ్యుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో చురుకుగా ప్రచారంలో పాల్గొనడంతో పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలను నాగబాబు తన భుజాన్న వేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించినప్పటికీ పొత్తుల కారణంగా ఆయనకు అవకాశం దక్కనప్పటికీ నిరుత్సాహ పడలేదు. కూటమి గెలుపు కోసం కష్టపడ్డారు. దీంతో జనసేన నుంచి రాజ్యసభ రేసులో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగబాబును రాజ్యసభ్యుడిగా ప్రతిపాదిస్తే పార్టీలో వ్యతిరేకత ఉండకపోవచ్చు. నామినేటెడ్ పదవులకంటే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే నాగబాబుకు సరైన గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుందనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో జనసేన అధ్యక్షులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

స్వచ్ఛభారత్‌కు మీరే వెన్నెముక


టీడీపీ నుంచి..

రాజ్యసభ రేసులో టీడీపీ నుంచి పలు పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలోని సీనియర్ నేతలతో పాటు.. గత ఎన్నికల్లో టికెట్లు దక్కని నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొంతమంది ప్రయత్నిస్తున్నా.. ఈ ముగ్గురిలో ఒకరికి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది.


పకడ్బందీగా పథకాల అమలు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 29 , 2024 | 05:20 PM