Devineni Uma: సైకో ప్రభుత్వం వల్లే విజయవాడకు ముంపు
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:54 PM
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుడమేరు పాపం గత ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘బుడమేరు గేట్లు ఎత్తేశారా..?’’ అని జగన్ అంటున్నారని... సీఎంగా.. ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 5: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Redd y) మాజీ మంత్రి దేవినేని ఉమా (Former Minister Devineni Uma) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుడమేరు పాపం గత ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘బుడమేరు గేట్లు ఎత్తేశారా..?’’ అని జగన్ అంటున్నారని... సీఎంగా.. ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని జగన్‌కు ఆందోళనగా ఉందన్నారు.
Anitha: గండికి.. గేట్లు ఎత్తడానికి తేడా తెలియన వ్యక్తి జగన్
సైకో ప్రభుత్వం వల్ల విజయవాడ నగరం ముంపు బారిన పడిందని వ్యాఖ్యలు చేశారు. వయస్సును కూడా లెక్క చేయకుండా చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. కేంద్ర బృందాలు.. కేంద్ర మంత్రులను రప్పించి.. కేంద్ర సాయం అందేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రకాశం బ్యారేజీకి అతి పెద్ద వరద వచ్చిందని... బ్యారేజీ ఎగువనున్న వాగులు పొంగాయన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన వైరుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి గతంలో పనులు ప్రారంభించామని గుర్తుచేశారు. పులిచింతల దిగువన.. ప్రకాశం బ్యారేజీ ఎగువన 13 టీఎంసీల నీటి నిల్వ చేసేందుకు ప్రణాళికలు రచించామన్నారు.
కానీ 2019 ఎన్నికల్లో సైకో ప్రభుత్వం వచ్చింది.. పనులు ఆగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పడవలు ఢీకొట్డంతో ధ్వంసమైన ప్రకాశం బ్యారేజ్ గేట్లు రిపేర్ చేయిస్తున్నామని తెలిపారు. నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో గేట్ల రిపేర్లు జరుగుతున్నాయన్నారు. బుడమేరు గండ్లని పూడుస్తున్నామని... గండ్ల ద్వారా వచ్చే ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు.
AP News: జోగి ఎక్కడ? హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..!
పనులు వేగవంతం...
కాగా... ధ్వంసమైన ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. బోట్లు గుద్దుకోవడం వల్ల ప్రకాశం బ్యారేజీ రెండు గేట్ కౌంటర్ వెయిట్‌లు డామేజ్ అయ్యాయి. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ స్థానంలో వేరే కౌంటర్ వెయిట్‌లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌నువెల్డింగ్ చేసి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌ను తప్పించేందుకు క్రేన్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. బెకెమ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరమ్మతు పనులు చేస్తోంది. పోలవరం గేట్లు, పులిచింతల, ప్రాజెక్టుల గేట్లను బెకెమ్ ఇన్ ఫ్రా ఏర్పాటు చేసింది. బ్యారేజీలో ఇరుక్కున్న నాలుగు పడవలను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది తొలగించనున్నారు. తొలుత 67,69 గేట్లు మూసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్లు ఏర్పాటు పనులు పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి...
Prakasam Barrage: ఏడురోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటే లక్ష్యంగా సాగుతున్న పనులు
Telugu Desam: రాసలీలల ఎమ్మెల్యే.. టీడీపీ నుంచి సస్పెన్షన్
Read Latest AP News And Telugu News