Home » Education News
విద్యాశాఖలో సమగ్రశిక్ష ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనది. చదువులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, పుస్తకాలు, ఇతర సామగ్రి పాఠశాలలకు చేరవేత, పథకాల అమలు గురించి ప్రభుత్వాలకు నివేదికలు, గణాంకాల సమర్పణ.. ఇలా నిత్యం కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన సమగ్రశిక్షలో కీలక పోస్టులన్నీ ఖాళీ అయ్యాయి. భర్తీ చేసేందుకు అధికారులు నెల క్రితం శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల నుంచి ...
సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 30వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసీఏఐ వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి లాగిన్ కావాల్సి ఉందని వివరించింది. ఈ పరీక్షలను సెప్టెంబర్లో నిర్వహించిన విషయం విధితమే.
రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రవేశ పరీక్షలను గతంలో కన్నా నెల రోజుల ముందుగానే నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.
రాబోయే 2025-26 విద్యా సంవత్సరానికి గాను జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ(ఎన్టీఏ) సోమవారం ప్రకటించింది.
పాఠశాల విద్యార్థులకు నిర్వహించే పరీక్షల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. 2023-24 విద్యా సంవత్సరం ఎఫ్ఏ-3, 2024-25 విద్యా సంవత్సరం ఎఫ్ఏ, ఎస్ఏ ప్రశ్న పత్రాలు, పనుల టెండర్లలో గోల్మాల్ చేశారు. వర్కుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులో అడ్డగోలుగా వ్యవహరించారు. వీటిపై రెండు విచారణలు జరిగాయి. ఎఫ్ఏ-3కి సంబంధించి రూ.31.80 లక్షల వర్క్ ఆర్డర్ ఉత్తర్వులపై డీఈఓ వరలక్ష్మి సంతకాలు లేవు. ఆమె ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించగా.. డిసెంబరులోనే ఆమె...
అపార్లో తప్పులు లేకుండా విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.
సోషల్ మీడియాపై పట్టు పెంచుకుని డబ్బులు సంపాదించేందుకు ఐర్లాండ్ దేశం తీసుకువచ్చిన Gen-Z అనే కొత్త కెరీర్ మార్గం యువతను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని యువత భావిస్తున్నారు.
పాఠశాల ప్రవేశాలు, టీసీ, ఎస్ఎస్సీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాంలు, ఇతర ప్రభుత్వ దరఖాస్తుల్లో కులం, మతం వివరాలు అడిగిన చోట ‘నో రిలీజియన్.. నో క్యాస్ట్’ అని రాయవచ్చునని.
ఉద్యోగాలు చేసేవారి(వర్కింగ్ ప్రొఫెషనల్స్) కోసం సాయంత్రం వేళ బీటెక్ కోర్సులు నిర్వహించేందుకు తొమ్మిది ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూ అనుమతినిచ్చింది.
మదర్సాలు విద్యార్థులకు సమగ్రమైన విద్యను అందించడంలేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) అభిప్రాయపడింది. ఈమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.