Home » Election Campaign
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అయితే ఈ యాక్ట్తో పేదలు చాలా నష్టపోతారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దేశంలో తొలిసారి అమలవుతోన్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ యాక్ట్ వల్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాందోళనలకు సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) సరైన వివరణ ఇచ్చారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు దిమ్మతిరిగేలా జగన్ కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 39వ డివిజన్లో జరిగిన ప్రచారంలో ఆయనతోపాటు వంగవీటి రాధా కృష్ణ పాల్గొన్నారు.
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్లో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సుజనాతో కలిసి వంగవీటి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో సుజనా చౌదరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. కొన్ని ప్రధాన సమస్యలను సుజనాకు సీనియర్ సిటిజన్స్ వివరించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోతో వైసీపీ డీలా పడింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇనచార్జి సిద్దార్థ్సింగ్ సమష్టిగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలో ప్రజాగళం పేరుతో కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ తరువాత గంట వ్యవధిలోనే కూటమి మేనిఫెస్టో అంశాలపై ఎక్కడ చూసినా చర్చ జరిగింది. నలుగురు కలిసిన చోటల్లా దీని గురించే మాట్లాడుకున్నారు. రాజకీయ విశ్లేషకులు, మేధావివర్గాలు సైతం ప్రధానంగా చర్చించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు.. ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు ...
కూటమి అధికారంలోకి వస్తే మండలంలోని ప్రతిచెరువుకు నీరిచ్చి రైతన్నను ఆదుకుంటానని ఎమ్మెల్యే ప య్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్ర చారంలో భాగంగా రోడ్షో నిర్వహించారు. గ్రామగ్రామాన విశేష స్పందన లభించింది. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేశవ్ అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రా ష్ట్రంలో రాక్షసరాజ్యం నడుస్తోం దని, అది పోయి రామరాజ్యం రావాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం ఎస్ రాజు, హిందూపురం పార్ల మెంటు అభ్యర్థి బీకే పార్థసారథి అన్నారు. వారు టీడీపీ నియోజక వర్గ సమ న్వయకర్త గుండుమల తిప్పేస్వామి తో కలిసి మంగళవారం అమరాపు రం మండలం బసవనపల్లి, ఆలద పల్లి, హేమావతి తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మ హి ళలు, రైతులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ గజమాలలతో గ్రామాల్లో స్వా గతం పలికారు.
మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని టీడీపీ ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని గరుగుచింతలపల్లి, చిన్నమల్లేపల్లి, కోమటికుంట్ల, పుట్లూరు, శనగలగూడూరు, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధే టీడీపీ తారకమంత్రమని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. పట్టణంలోని దళిత వాడలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె మంగళవారం మంగళవారం పరిగి మండలంలోని ఊటకూరు, శాసనకోట, పరిగి పంచా యతీల పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ఇక్కడి ప్రజలకు అండగా ఉన్నానన్నారు. రాజకీయాల్లోకి వచ్చిందే ఈ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికని, కార్యకర్తల వెన్నంటే ఉంటానన్నారు.
నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటే యాలని నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ వారం పట్టణంలోని ముక్కడిపేట, నల్లప్ప లేఅవుట్, కట్లనాగరాజప్పవీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మాట్లాడుతూ హిందూపురం నియోజకవ ర్గం ప్రశాంతతకు, మంచిపేరుకు మారుపేరన్నారు. ఇలాగే కొనసా గాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు.