Home » Election Campaign
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువత కోసం మెగా డీఎస్సీపైనే తొలిసంతకం చేయనున్నట్లు కూ టమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నా రు. సోమవారం పట్టణంలోని 24వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
మండలంలోని జనార్దనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు భారీ గజమాలతో గ్రామస్థులు, మహిళలు సోమవారం ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్‌షోలో పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ టీడీపీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.
ప్రశాంతంగా ఉన్న మడకశిర నియోజకవర్గంలో శాంతియు తంగానే ఎన్నికల ప్రచారం సాగిస్తూ ఓట్లను అభ్యర్థిస్తు న్నామని టీడీపీ పురం పార్ల మెంట్ అభ్యర్థి బీకే పార్థ సారథి పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుతో కలిసి సోమవారం గుడిబండ మండ లంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ... మడకశిర నియోజకవ ర్గంలో కత్తులు పట్టి, రౌడీయిజం చేస్తూ టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన సొంత పత్రిక, చానల్లో వస్తున్న కథనాలపై స్పందించారు.
హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ ను మూడోసారి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నందమూరి వసుం ధరా దేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం శ్రీకంఠపురం, డీబీ కాలనీ, డీఆర్ కాలనీ, నానెప్పనగర్, లక్ష్మీపురం, పులమతిరోడ్డు, మోడల్‌కాలనీ ల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మా ట్లాడుతూ... బాలకృష్ణ ప్రతిపక్షంలో ఉన్నా అధికార ప క్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తుంటాడన్నారు.
తెలుగుదేశం పార్టీతోనే మైనార్టీల సంక్షేమమని టీడీపీ కూటమి ఎమ్మె ల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె సోమవారం ఉద యం పెనుకొండ పట్టణం దర్గాపేటలో ఇంటింటా ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో సూపర్‌సిక్స్ పథకాలు, మైనార్టీలకు గతంలో ఉన్న సంక్షేమ పథకాల ను వివరించారు. చంద్రబాబును అరెస్ట్చేసినప్పుడు మైనార్టీలు రోడ్లపై తెలిపిన నిరసనతోనే జగన పాలనపై వారికి ఎంత వ్యతిరేక ఉందో అర్థం అవుతుందన్నారు.
బీటీపీ నీటిని తీసుకువచ్చి కళ్యాణదుర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. మండలంలోని శీగలపల్లి, మలయనూరు, నాగేపల్లి, గొల్లరహట్టి, నిజవళ్లి, వెంకటంపల్లి, శ్రీమజ్జనపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.దొంతమూరు వెల్దుర్తి సెంటర్లో ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తూ.. వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Andhrapradesh: తిరుమలలో కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని సన్నిధిలో ప్రచారం మహా భాగ్యమన్నారు. ఐదేళ్లలో తిరుమలను కలుషితం చేశారని మండిపడ్డారు.
Telangana: కర్ణాటకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా గుర్మిట్కల్లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచారసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారన్నారు. 1972లో మొదటిసారిగా ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే... ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన ‘పేలవ ప్రదర్శన’ కొనసాగుతోంది. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆగిపోతాయని జనాన్ని బెదిరించి, లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని అన్నారు. నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలు చేశామని అన్నారు. కానీ ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్ట్, సీపీఎస్ రద్దు, మెగా...