Home » Election Campaign
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తాచానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నాపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి. అలా చేస్తే నా యావదాస్తిని రాసిస్తా. బీజేపీ మ్యానిఫెస్టోలో బీసీల కోసం ఒక్క అంశాన్నీ చేర్చలేదు.
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? గత పదేళ్లుగా బీఆర్‌ఎ్‌సకు మద్దతుగా నిలిచిన ముస్లింలు ఈసారి హస్తం పార్టీకి అండగా ఉండాలనుకుంటున్నారా?
పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడంలేదా? తమ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు (అసెంబ్లీ
భౌగోళికంగా తెలుగు రాష్ట్రాలకు గుమ్మంలా భావించే ఖమ్మం నియోజకవర్గం మొదటి నుంచీ కాంగ్రె్‌సకు కంచుకోటగా నిలుస్తోంది. గతంలో జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కరరావు
‘‘పుట్టేది ఒక్కసారే.. చనిపోయేది ఒక్కసారే.. మమ్మల్ని భయపెట్టి లొంగదీసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. తల తెగిపడినా సరే మోదీ ముందు తలవంచం. కేసీఆర్ పాలన అంటే పదేళ్ల నిజం.. బీజేపీ పాలన పదేళ్ల
వైసీపీ పాలన అన్ని రంగాల్లో విఫల మైందని.... రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోయి, చంద్ర బాబు రావాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుం డుమల తిప్పేస్వామి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. వారు శనివారం అగళి మండల కేంద్రంలో అనంతరం రామాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.... మడకశిర ప్రాంతానికి పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు రావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు.
పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ వారికి ఓటమి భయం పుట్టుకుందని పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. రొద్దం మండల పరిధిలోని ఆర్ మరువపల్లిలో శనివారం టీడీ పీ నాయకుడు నరసింహులు స్వగృహంలో ఆమె టీడీపీ స్థానిక నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... ప్రతి కా ర్యకర్త సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వి జయానికి సైనికుడిలా పనిచేయాల ని కోరారు. గ్రామాల్లో అత్యధికంగా పోలింగ్ జరిగేలా పనిచేయా లని... తనకు, బీకేకు ఓట్లు పడేలా కృషిచేయాలన్నారు.
ప్రజల ఆశీస్సులే మా కుటుంబానికి శ్రీరామరక్ష అని, మీ ఆశీర్వాదాలతోనే మా కుటుంబానికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, మీ రుణం తీర్చుకోలేనిదని టీడీపీనేత జేసీ పవనరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో శనివారం ఆయన విస్తృతంగా బహిరంగసభలు నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకరోజు ముందే మద్యం షాపుల్లో మందు కరువైంది. వైనషాపుల్లోకి రాకముందే పక్కదారి పట్టడంతోనే దుకాణాలు మూసివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎక్కడచూసినా వైనషాపుల వద్ద మందుబాబులు ఎగబడి మరీ దొరికిన మద్యాన్ని తీసుకున్నారు.