Share News

KTR : తల తెగినా.. మోదీ ముందు తలొంచం

ABN , Publish Date - May 12 , 2024 | 05:41 AM

‘‘పుట్టేది ఒక్కసారే.. చనిపోయేది ఒక్కసారే.. మమ్మల్ని భయపెట్టి లొంగదీసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. తల తెగిపడినా సరే మోదీ ముందు తలవంచం. కేసీఆర్‌ పాలన అంటే పదేళ్ల నిజం.. బీజేపీ పాలన పదేళ్ల

 KTR : తల తెగినా.. మోదీ ముందు తలొంచం

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటైతే కవిత జైల్లో ఉంటదా?: కేటీఆర్‌

హుజూరాబాద్‌/మంచిర్యాల/హైదరాబాద్‌ సిటీ/ముషీరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ‘‘పుట్టేది ఒక్కసారే.. చనిపోయేది ఒక్కసారే.. మమ్మల్ని భయపెట్టి లొంగదీసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. తల తెగిపడినా సరే మోదీ ముందు తలవంచం. కేసీఆర్‌ పాలన అంటే పదేళ్ల నిజం.. బీజేపీ పాలన పదేళ్ల విషం.. 150 రోజుల అబద్ధం కాంగ్రెస్‌ పాలనల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్‌ బేవకూఫ్‌ గాళ్లు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే మా చెల్లి కవిత జైల్లో ఉంటదా? ఎన్నికల అనంతరం రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతాడని ఆ పార్టీ ఎంపీలే చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచే అవకాశం లేదు. పొరపాటున మీరు ఆ పార్టీకి ఓటేస్తే బీజేపీకి మేలు జరుగుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ కోరారు. శనివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో, మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో, జూబ్లీహిల్స్‌, ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీలతో నిర్వహించిన సమావేశాల్లోనూ పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి పోటి చేస్తున్నాడని, ఒకవేళ ఆయన గెలిస్తే బీజేపీలో చేరడన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. పదేళ్లు పాలించిన ప్రధాని మోదీ ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పారని, మరి ఆ డబ్బులు ఏవని నిలదీశారు. ఆర్‌ఎ్‌సఎస్‌ మనిషి రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండడం వల్లే రాష్ట్రంలో రంజాన్‌ తోఫా రాలేదని ఆరోపిచారు.

Updated Date - May 12 , 2024 | 05:41 AM