Home » Election Campaign
రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్, కామారెడ్డిలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.
చంద్రబాబునాయుడును మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని టీడీపీ రాయలసీమ జోనల్ ఇనచార్జి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి అన్నారు.
ఎన్నికల ఫలితాల్లో తాడిపత్రిలో ఎగిరేది పసుపు జెండానే, గెలిచేది జేసీ అశ్మితరెడ్డే అని, వచ్చే ఐదేళ్లల్లో అభివృద్ధి అంటే ఏమిటో నా బిడ్డ చేసి చూపిస్తాడని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. పట్టణంలోని సీబీరోడ్డు, అశోక్‌పిల్లర్, మెయినబజారు, నవరంగ్ టాకీ్‌సరోడ్డు, పోలీ్‌సస్టేషనరోడ్డు మీదుగా ర్యాలీ సాగింది.
దేళ్లుగా నరకయాతన పెడుతున్న వైసీపీ ప్రభుత్వం, పార్టీ నాయకులకు భయపడవద్దని, అతి త్వరలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, తాను అండగా ఉంటానని కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం భరోసా ఇచ్చారు. పామిడిలో శుక్రవారం చేపట్టిన ర్యాలీ విజయవంతమైంది.
నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలం టే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు లాంటి సమర్థ వంతమైన నాయకుడిని ఎ న్నుకోవాలని సినీనటుడు సప్తగిరి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి అమరాపురం మండల కేంద్రంలో టీ డీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, నియోజకవర్గ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలసి రోడ్‌షోలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ముందు చూపున్న నేత చంద్రబాబు అని రాష్ట్రం అభివృధ్ధి చెందాలన్నా, వెనకబడిన ప్రాంతమైన మడకశిర అన్ని రంగాల్లో అభివృధ్ది చెందాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను అశీర్వదించాలన్నారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఉరవకొండలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, పార్క్ ఆంజనేయస్వామి గుడి, కామన్నకట్ట, జైనబ్బీ దర్గా కూడలిలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మైనార్టీల పై వైసీపీ కపట ప్రేమ చూపుతోం దని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నా యకుడు షేక్ మహ్మద్ ఇక్బాల్‌అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిందూపురానికి వచ్చారు. ఈ సందర్భంగా చిలమత్తూరు మండలం కొడికొండ వైసీపీ ఎంపీటీసీ ఇర్షాద్‌బేగం, షఫీ ఇక్బాల్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిని పార్టీ కండువావేసి ఆహ్వానించారు. అలాగే పట్టణంలోని 25వ వార్డు వైసీపీ ఇనచార్జ్ కార్తీక్ ఇక్బాల్ సమక్షంలో టీడీపీలో చేరారు. అదేవిధంగా సంతేబిదునూరు లో ఆయన మైనార్టీల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కళ్యాణదుర్గంలో టీడీపీ విజయం ఖాయమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రజావేదిక వద్ద వివిధ గ్రామాల నుంచి భారీఎత్తున టీడీపీలోకి చేరారు. వీరందరికీ అమిలినేని కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేసి పేదల సంక్షేమాన్ని అందిస్తుందని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులుస్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయదుర్గం మండలంలోని డీ కొండాపురం, గుమ్మఘట్ట మండలంలోని శిరిగేదొడ్డి, చెరువుదొడ్డి, భూతయ్యదొడ్డి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు.
ముఖ్యమంత్రి జగన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెచ్చి ప్రజల భూములకు రక్షణ లేకుండా చేశారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు విమర్శించారు. ఓటు ద్వారా జగనకు బుద్ధి చెప్పా లని పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం అమరాపురం మండలంలోని వలస, తమ్మడేపల్లి, హలుకూరు, గౌడన కుంట గ్రామాల్లో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు హార తులతో ఘన స్వాగతం పలికారు.