GUMMANURU: వైసీపీకి భయపడొద్దు.. అండగా ఉంటా..
ABN , Publish Date - May 11 , 2024 | 12:13 AM
దేళ్లుగా నరకయాతన పెడుతున్న వైసీపీ ప్రభుత్వం, పార్టీ నాయకులకు భయపడవద్దని, అతి త్వరలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, తాను అండగా ఉంటానని కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం భరోసా ఇచ్చారు. పామిడిలో శుక్రవారం చేపట్టిన ర్యాలీ విజయవంతమైంది.
కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం
పామిడి, మే 10: ఐదేళ్లుగా నరకయాతన పెడుతున్న వైసీపీ ప్రభుత్వం, పార్టీ నాయకులకు భయపడవద్దని, అతి త్వరలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, తాను అండగా ఉంటానని కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం భరోసా ఇచ్చారు. పామిడిలో శుక్రవారం చేపట్టిన ర్యాలీ విజయవంతమైంది. సరస్వతీ విద్యా మందిరం నుంచి వాల్మీకి సర్కిల్ వరకూ చేపట్టిన ఈ ర్యాలీ బాణాసంచా పేలుస్తూ, డప్పులు, యువత ఈలలు, కేరింతల మధ్య ఎంతో కోలాహలంగా సాగింది. ర్యాలీతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండింది. వాల్మీకి సర్కిల్ వద్ద గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ పోలింగ్ రోజు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కూటమితోనే సర్వతోముఖాభివృద్ధి : కూటమితోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని గుమ్మనూరు జయరాం అన్నారు. మండలంలోని నీలూరు, తంబళ్లపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన ప్రచారం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తంబళ్లపల్లి గ్రామానికి వంకలో బ్రిడ్జి నిర్మాణానికి తోడ్పడతానన్నారు. తంబళ్లపల్లి గ్రామంలో టీడీపీలోకి 10 కుటుంబాలు గుమ్మనూరు జయరాం సమక్షంలో చేరాయి. ఆయా కుటుంబాలకు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీ నాయకులు కేసీ హరి, ప్రభాకర్ చౌదరి, బొల్లు శ్రీనివాసరెడ్డి, గౌస్‌పీరా, సంజీవకుమార్, ముసలిరెడ్డి, అప్పన్నగారి కుమార్, ఆర్‌ఆర్ రమేష్ పాల్గొన్నారు.
గుత్తి: ఆరాచక అవినీతి పాలన నుంచి మరో మూడు రోజుల్లో విముక్తి కలిగించేందుకు మీ ఓటుతో వైసీపీని తరిమికొట్టాలని గుంతకల్లు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం సాయంత్రం స్ధానిక రాజీవ్ సర్కిల్ వద్ద నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఆధ్వర్యంలో భారీగా రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షో గాంధీ సర్కిల్, సీఎ్‌సఐ చర్చి మీదుగా కొనసాగింది. కార్యకర్తలు తప్పట్లతో చిందులు వేస్తూ ఘనంగా ర్యాలీలో పాల్గొన్నారు. అభ్యర్థులు ప్రజలకు అభివాదం చేస్తూ కొనసాగారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ నుంచి ప్రజలు విసిగిపోయారన్నారు. వారు పెట్టిన ఆరాచకాల నుంచి బేజారు అయ్యారన్నారు. వైసీపీకి అంతం ప్రారంభమైంది. మరో మూడు రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలపించాలని, టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. స్ధానిక వైసీపీ నాయకులపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీఓ కాపీలను చింపివేశారు. టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ, కేసీ హరి, బద్రివలి, దిల్కాశీనా, న్యాయవాది సోమశేఖర్ పాల్గొన్నారు.