KALAVA ROADSHOW: సూపర్‌సిక్స్ పథకాలతో పేదల సంక్షేమం
ABN , Publish Date - May 11 , 2024 | 12:06 AM
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేసి పేదల సంక్షేమాన్ని అందిస్తుందని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులుస్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయదుర్గం మండలంలోని డీ కొండాపురం, గుమ్మఘట్ట మండలంలోని శిరిగేదొడ్డి, చెరువుదొడ్డి, భూతయ్యదొడ్డి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు.
కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గంరూరల్/గుమ్మఘట్ట, మే 10: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేసి పేదల సంక్షేమాన్ని అందిస్తుందని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులుస్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయదుర్గం మండలంలోని డీ కొండాపురం, గుమ్మఘట్ట మండలంలోని శిరిగేదొడ్డి, చెరువుదొడ్డి, భూతయ్యదొడ్డి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూలమాలతో ఆయన సత్కరించి స్వాగతించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సంవత్సరానికి, మూడు సిలిండర్లు, పట్టా పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థికసాయం, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపడుచుకు నెలకు రూ.1500 అందిస్తుందన్నారు. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన అందిస్తామన్నారు.
ఎంపీటీసీ శ్యామల టీడీపీలో చేరిక: రాయదుర్గం మండలంలోని మెచ్చిరి ఎంపీటీసీ శ్యామలతో పాటు గ్రామానికి చెందిన నలుగురు వార్డు మెంబర్లు అనూరాధ, గంగమ్మ, రాజన్నలతో పాటు మరొకరు శుక్రవారం టీడీపీలో చేరారు. చదం గొల్లదొడ్డి గ్రామంలో మాజీ ఎంపీటీసీ కుమారుడు నాగప్ప, డొక్కు ముత్యప్ప, కిష్టప్ప, తిప్పేస్వామితో పాటు మరో ఆరు కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి కాలవ శ్రీనివాసులు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
రైతులకు అండగా నిలిచేది టీడీపీయే
కణేకల్లు: రైతులకు ఎల్లవేళలా అండగా నిలిచేది టీడీపీయేనని కాలవ శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన యర్రగుంట, పుల్లంపల్లి, నల్లంపల్లి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత రైతులు నాన ఆయకట్టు భూములలో పంటల సాగుకు హెచ్చెల్సీ నీటిని వాడుకున్నా ఏ రోజు కూడా అభ్యంతరం చెప్పలేదన్నారు. ఎన్నికలు మరో రెండురోజులు ఉన్న దృష్ట్యా టీడీపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాలు
రాయదుర్గం: నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలిచ్చి ఉపాధి కల్పిస్తామని కాలవ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని గుమ్మఘట్ట రోడ్డులో వున్న రైస్‌మిల్ వద్ద తెలుగుయువత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాషా్ట్రనికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమని, ఆయన్ను గెలిపించుకోవడానికి యువత నడుం బిగించాలన్నారు. రాషా్ట్రనికి ఉజ్వల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించేందుకు సైనికుల్లా శ్రమించాలన్నారు.