TDP: చంద్రబాబుతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి
ABN , Publish Date - May 11 , 2024 | 12:17 AM
చంద్రబాబునాయుడును మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని టీడీపీ రాయలసీమ జోనల్ ఇనచార్జి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి అన్నారు.
పుట్లూరు, మే 10: చంద్రబాబునాయుడును మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని టీడీపీ రాయలసీమ జోనల్ ఇనచార్జి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి అన్నారు. మండలంలోని ఏ. కొండాపురం, అరకటవేముల, సూరేపల్లి, మడ్డిపల్లి, ఓబులాపురం, కడవకల్లు, కొండుగారికుంట తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి నాయకులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంబికా లక్ష్మినారాయణ, బండారు శ్రావణిశ్రీలను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయన వెంట చంద్రదండు అధ్యక్షుడు ప్రకా్‌షనాయుడు, సుదర్శననాయుడు, సోమశేఖర్‌నాయుడు, రామాంజనేయులు, నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
యల్లనూరు: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి మండలంలో శుక్రవారం టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కూచివారిపల్లి, వాసాపురం గ్రామాల్లో ఆయన ఇంటింటికి తిరిగి టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట వాసాపురం నరేంద్రనాయుడు, కూచివారిపల్లి సంజీవరాయుడు, కార్యకర్తలు ఉన్నారు.