Home » Election Campaign
స్థానిక కొట్నూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ ఉందని తెలిసినా పది గంటల వరకు పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మరోపక్క ఉద్యోగులు తమ ఓటు హక్కుకు వినియోగించుకునేందుకు ఉదయం 9 గంటలకే క్యూలైన్లో నిలబడ్డారు. వచ్చిన వారికి కనీసం పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీని వలన మహిళా ఓటర్లు సుమారు మూడు గంటల పాటు చెట్ల నీడనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని, పెను కొండలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా వారు అనుసరించిన విధానమే అందుకు నిదర్శనమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. ఆమె మంగళవారం మండలంలోని గుట్టూరు, వెంకటగిరిపా ళ్యంలో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా సవితకు పూల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు టీడీపీకి ఓటు వేసి వైసీపీ అరాచకాలను అరికడదామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మంగళ వారం పట్టణంతో పాటు రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాల నంతా అరాచకాలు, అఘాయిత్యాలతో సాగిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చింద న్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలు ప్ర జలకు ఎంతగానో అండగా నిలుస్తాయన్నారు.
టీీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటువేయాలని టీడీపీ, కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని వరదాయపల్లి, ధర్మాపురం, పెద్దపప్పూరు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుంచి మండలంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు.
టీడీపీ హయాంలోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని సత్యం కన్షెనల్ హాల్లో మంగళవారం కురుబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు మునువు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టీడీపీలో మాత్రమే అన్ని కులాలకు సమన్యాయం లభిస్తుందని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. మంగళవారం ఉదయం పాతగుంతకల్లులోని కనకవీటి వీధిలో పెద్ద సంఖ్యలో కురుబలు టీడీపీలోకి చేరారు. దాదాపు 70 కుటుంబాలు జయరాం సమక్షంలో పార్టీ కండువాలు ధరించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఉచిత తాగునీటి కనెక్షన అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం డీ.హీరేహాళ్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర ్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. సూపర్‌సిక్స్ పథకాల కరపత్రాలను అందించి ఓటు వేయాలని కోరారు.
కళ్యాణదుర్గం ప్రజల కలలను నెరవేర్చడమే తన మొదటి కర్తవ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ జనసేనాని ప్రచారంలో దూసుకెళ్తునే ఉన్నారు. దీనికి తోడు ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. - మంగళవారం తోలుకొడు, వెదురు బీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విరుచుకుపడ్డారు. ‘‘తన అడుగులకు మడుగులోత్తలేదని.. టిక్కెట్ ఇస్తా... ఖర్చులు మొత్తం నేనే భరిస్తా..