Home » Election Commission
ఎన్నికల సమయంలో ఏపీటీఎఫ్ నాయకులు సమావేశం ఏర్పాటు చేయడంపట్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆ యూనియన నాయకులను, రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్ హెచఎంను శుక్రవారం విచారించినట్లు తెలిసింది. ఆ పాఠశాలో ఎలాంటి సమావేశం నిర్వహించలేదని ...
పోలింగ్ డేటాలోని వ్యత్యాసాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యక్తం చేసిన అనుమానాలు, ఎన్నికల ప్రక్రియ చిత్తశుద్ధిని ప్రశ్నించడంపై ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై జరిపిన దాడిగా పేర్కొంది. ఈ మేరకు ఖర్గేకు ఈసీ శుక్రవారంనాడు లేఖ రాసింది.
Telangana: ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు చాలా మంచి స్పందన వచ్చిందని... 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారని వెల్లడించారు.
Andhrapradesh: ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అలాగే పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సహజంగా పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఏజెంట్లు గుర్తించిన తర్వాతే వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తారు పోలింగ్ సిబ్బంది.
ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్‌లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
Andhrapradesh: ఈసీ నిర్ణయాన్ని అపహస్యం చేసే విధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలపై ఈసీ నిన్న (గురువారం) స్పష్టంగా ఆర్డర్ ఇచ్చిందని.. జగన్ ఆరు స్కీమ్స్‌కు బటన్ నొక్కితే డబ్బులు పడలేదన్నారు. లబ్ధిదారులకు డబ్బులు లేవని.. సాక్షికి మాత్రం ప్రకటనలు ఇస్తారని మండిపడ్డారు.
తెలంగాణ(telangana)లో లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(government) సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మే 13న వేతనంతో కూడిన సెలవు(paid holiday) ఇస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు-2024 పోలింగ్‌కి సమయం దగ్గర పడుతోంది. రేపు (శనివారం) ప్రచారపర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం ప్రియులను కాస్త నిరాశకు గురిచేసే కీలక అప్డేట్ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 13న పోలింగ్ జరగనున్నందున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం (EC) నిషేధం విధించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా సరే గెలవాలని చూస్తోంది. అందుకోసం అడ్డదారులను వెతుకుతుంది. తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. తిరుపతిలో ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వివరించారు.
మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024) జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ చేస్తున్న కుటీల ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్‌కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది.