Home » EVM Machine
దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వాటి విశ్వసనీయతపై ఆందోళన మొదలైంది.
ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
ఈవీఎంల కారణంగానే జేడీఎస్, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ (Minister Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎం(EVM)లు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా? అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు.
సార్వత్రిక ఎన్నికలపై టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ చేసిన కామెంట్ల దుమారం కొనసాగుతోంది. పోలింగ్ జరిగే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాకింగ్ జరుగుతున్నాయని కామెంట్ చేశారు. మాస్క్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఏకీభవించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలానే జరిగి ఉంటాయని సందేహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంల భద్రతపై చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అది తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలతో ఈవీఎంల అంశం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs) వినియోగంపై బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar ) స్పందించారు. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
దేశంలో ఎన్నికలు ముగిశాయి. ప్రజల తీర్పు వెలువడింది. ఫలితాలతో ఈవీఎంల వివాదానికి తెరపడిందని అంతా భావించారు. కానీ ఈవీఎంలపై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కాంగ్రెస్ కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలిసింది.