Home » Exit polls
ఈసారి లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు.. వారం రోజుల గ్యాప్ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ సాగింది. ఏడో దశ..
మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఏడో దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో లోక్ సభ పోలింగ్ ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి.
Lok Sabha Elections Of India: ఎన్నికల తుదిదశ పోలింగ్ వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్(Exit Poll 2024) వెల్లడించే సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేశారో తప్పదు శిక్ష అంటూ హెచ్చరించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126(ఏ)(1) ప్రకారం ఎన్నికలు జరుగుతున్నప్పుడు..
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం చివరి దశకు వచ్చింది. జూన్ 1వ తేదీన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పడనుంది. టీవీ ఛానెల్స్ పోటీపడి చర్చా కార్యక్రమాలు జరుపుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఎగ్జిట్ పోల్స్ డిబేట్'లో తమ పార్టీ పాల్గొనేది లేదని శుక్రవారంనాడు ప్రకటించింది.
ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్ పోల్స్‌ను విడుదలచేస్తాయి.
జూన్ ఒకటి... దేశంలో ఆఖరి విడత పోలింగ్ జరిగే రోజు. ఆ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను బహిరంగ పర్చడానికి సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.
ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. చాలా కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగ్. ఓట్ల లెక్కింపులో ఏ చిన్న తేడా జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఓట్ల లెక్కింపులో ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గురువారం వరుసగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే ఇండియాటుడే యాక్సిస్ మై సర్వే మాత్రం గురువారం తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించలేదు. ఒకరోజు ఆలస్యంగా శుక్రవారం సదరు సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తరుణంలో.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..