Home » Food and Health
హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఒక వైపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు నాణ్యతలేని భోజనమే అందుతోంది.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార కల్తీ, మధ్యాహ్న భోజనం వికటించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రధానంగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఒకే వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా? అంటూ హైకోర్టు సీజే ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడింది.
మధ్యాహ్న భోజనం విషతుల్యమై విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్న అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు.
పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. దుకాణాల మూసివేత విషయంలో ఎంఐఎం నేతల బెదిరింపులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు.
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఆహార తనిఖీ విభాగం రాష్ట్ర అధికారులు సోమవారం ఖమ్మంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా పలు ఆహార తయారీ కేంద్రాలు, స్వీట్స్ దుకాణాలు, పిండి వంటల కేంద్రాల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు.
రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన తందూరి చికెన్, మటన్ డీప్ ఫ్రై(Chicken and mutton deep fry).. రా చికెన్.. నల్లగా మారిన నూనె.. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లలో దుర్వాసన.. కుళ్లిన కూరగాయలు.. పురుగులు పడ్డ సూప్ - ఇవీ మాసబ్ట్యాంక్లోని మొఘల్, డైన్హిల్ హోటళ్లలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అదనపు కమిషనర్(హెల్త్) పంకజ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన విషయాలు. అక్కడి పరిస్థితులను చూసి వారు విస్తుపోయారు.
మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాల, ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
అందరికీ జామ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు.. కానీ జామ 5 జామ ఆకులతో ఇంత మ్యాజిక్ జరుగుతుందని తెలుసుండదు.