Home » Gannavaram
Andhrapradesh: తమిళనాడులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే లోకేష్ కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. గురువారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో యువనేత కోయంబత్తూరు పయనమయ్యారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా ప్రచారం లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే యువనేత అక్కడకు బయలుదేరి వెళ్లారు. తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేయనున్నారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(AP High Court) రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం, రాష్ట్రం నిధులు(Govt Funds) జమ చేయకుండా చేసినట్లు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం జమచేయాల్సిన రూ.75 కోట్లు సొమ్ము ఎక్కడని రాష్ట్ర ప్రభుత్వాన్ని(Andhra Pradesh Govt) హైకోర్టు ప్రశ్నించింది.
కృష్టా జిల్లా: వల్లభనేని వంశీ, అతని అనుచరులను టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై ఆయన మండిపడ్డారు. ఊరి చెరువు మట్టి కొంతమంది జేబులోకి వెళుతుంటే సోదరులారా మీరెందుకు ప్రశ్నించడం లేదన్నారు. దాడులు చేసి రివర్స్ కేసు పెట్టే పరిస్థితి గన్నవరంలో ఉందన్నారు...
కృష్టా జిల్లా: గన్నవరం మండలం, సూరంపల్లి పామాయిల్ తోటలో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయి. దీంతో విశ్వాసనీయ సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు, గన్నవరం, నాలుగు స్టేషన్ల పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు.
కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన బంధువు (మేనత్త) వైఎస్ విమలా రెడ్డి పావులు కదుపుతున్నారు.
AP Congress : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార వైసీపీకి ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంచార్జుల మార్పు ఏ క్షణాన సీఎం వైఎస్ జగన్ రెడ్డి షురూ చేశారో.. టపీ టపీమని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్లు రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. అయితే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార పార్టీ నుంచి చేరికలు ఇప్పుడిప్పుడే షురూ అవుతున్నాయి..
Andhrapradesh: గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చెక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చెన్నై, బెంగళూరు ఇండిగో విమానాలు గాలిలో చక్కెర్లు కొట్టాయి.
Andhrapradesh: వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బ్రదర్ అనిల్ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎస్కార్ట్ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కేసరపల్లిలో విల్లాకి బ్రదర్ అనిల్ బయలుదేరి వెళ్లనున్నారు.
Andhrapradesh: గన్నవరంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు టీడీపీ మద్దతు తెలిపింది. సీడీపీవో కార్యాలయం ఎదుట సమ్మెలో పార్టీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) కి గన్నవరం ( Gannavaram ) నియోజకవర్గ ప్రజానీకం మరోసారి బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం నాడు తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకి చంద్రబాబు వచ్చారు.