Home » GHMC
మూసీ నదికి ఇరువైపులా నివాసాల మార్కింగ్, కూల్చివేతలతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) స్పష్టం చేశారు.
బూత్‌స్థాయి నుంచి బీజేపీ(BJP)ని బలోపేతం చేయాలని ఆ పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు(President Dr. N. Gautam Rao) కోరారు. సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే ఎన్నికలలో ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.
మహదేవపురం(Mahadev puram) కాలనీలో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డూ అదుపులేకుండాపోతోంది. అధికారులు బిల్డింగ్‌లను సీజ్ చేసిన వారం రోజుల్లోపే మళ్లీ నిర్మాణ పనులు మొదలుపెడుతున్నారు. భవన యజమానుల నుంచి అధికారులు స్లాబ్కొక ధర చొప్పున డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేశ ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ను మరింత ప్రగతి పథంలో నడిపించేలా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా రహదారుల విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.
శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారం ప్రభుత్వం సభలో ఐదు ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టింది. ఇందులో పంచాయతీరాజ్ చట్టం, పురపాలక చట్టం, జీహెచ్ఎంసీ చట్టం, వస్తుసేవల(జీఎస్టీ) చట్టం, వేతనాలు పింఛన్ల చట్టంలో సవరణలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఏటా 89 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతున్నా.. కేవలం 0.95 శాతం వర్షపు నీరు మాత్రమే భూమిలో ఇంకుతోందని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) అన్నారు.
పారిశుధ్య నిర్వహణ ప్రైవేటీకరణకు జీహెచ్ఎంసీ(GHMC) అమితాసక్తి చూపుతోంది. ఈసారి టెండర్ లేకుండా మరో 64.40 కిలోమీటర్ల పరిధిలోని కారిడార్లను ఏజెన్సీలకు అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్ మున్సిపల్ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన షెడ్లు, కట్టడాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు(Municipal and revenue officials) గురువారం కూల్చివేశారు.
చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా(HYDRA) మరోసారి రంగంలోకి దిగింది. గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లోని పలు చెరువులను కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) పరిశీలించారు.
అపరిశుభ్రంగా ఉన్న రెండు చికెన్ దుకాణాలను సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులను ఓ ఎమ్మెల్సీ(MLC), కొందరు స్థానికులు బెదిరించారని పోలీసులకు జీహెచ్ఎంసీ(GHMC) ఫిర్యాదు చేసింది. అధికారులు స్వాధీనం చేసుకున్న పదార్థాలను స్థానికులు బలవంతంగా తీసుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు.