Home » gold rates
బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రెండురోజుల క్రితంతో పోల్చితే మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ బంగారానికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర పైపైకి వెళుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు.
కొంత కాలంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Prices Today) నాలుగైదు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ(మే 5)న ధరలు స్థిరంగా కొనసాగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1710 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్లో ఈ రోజు 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7 వేల 88గా ఉంది. పది గ్రాముల బంగారం ధర 70 వేల 880గా ఉంది. నిన్న బుధవారం నాడు మాత్రం రూ.72 వేల 590గా ఉంది.
గత కొన్నిరోజుల నుంచి బంగారం ధర పెరుగుతోంది. ఇందుకు ఐదు కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఆధిపత్య పోరు, చైనా కొనుగోళ్లు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ ఎన్నికలు ముందు అనిశ్చితి పరిస్థితులు, అమెరికా డాలర్తో రూపాయి విలువ పడిపోవడం అనే కారణాల వల్ల బంగారం ధర పెరుగుతుందని మార్కెట్ నిపుణులు వివరించారు.
వరసగా పెళ్లిళ్లు, శుభ ముహుర్తాలు ఉండటంతో బంగారం ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరువ కానుంది. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.68,450గా ఉంది. కిలో వెండి ధర రూ.78 వేలుగా ఉంది.
బంగారం ధరలు వరసగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల్లో 10 గ్రాముల ధర రూ.550 మేర తగ్గింది. వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 తగ్గింది. రూ.61,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. రూ.66,970 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం, 24 బంగారం ధరల్లో సోమవారం ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.59,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సగటున రూ.64,960గా ఉంది.
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా డాలర్ బలహీన పడటంతో బంగారం ధర పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరింది. అమెరికాల్లో వడ్డీరేట్లు తగ్గించే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.60,100కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.430 పెరిగి రూ.65,560కి చేరింది.