MLA Raja Singh: వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వండి
ABN , Publish Date - Apr 02 , 2025 | 08:54 AM
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్‌బోర్డు బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ఎలాంటి షరతు లేకుండా మద్దతు ప్రకటించాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మంచి వాతావరణం వచ్చింది, ప్రధాని మోదీ మంచి నిర్ణయం తీసుకుని 14 మార్పులు కూడా చేశారన్నారు.

- ఏపీ, బిహార్ ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి
- వీడియో విడుదల చేసిన రాజాసింగ్
హైదరాబాద్ సిటీ: పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టనున్న వక్ఫ్‌బోర్డు బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ఎలాంటి షరతు లేకుండా మద్దతు ప్రకటించాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Raja Singh) కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. వక్ఫ్‌బోర్డు బిల్లును ప్రవేశపేట్టలంటే దమ్ము ఉండాలని, ఆ దమ్ము బీజేపీ(BJP)కి మాత్రమే ఉందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Rice: సన్నబియ్యం కోసం సందెవేళలోనూ..
ఏపీ, బిహార్ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయడు, నీతిష్కుమార్(Chandrababu Naidu, Nitish Kumar) ఈ విషయంలో చొరవ తీసుకుని వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వాలని వీడియోలో కోరారు. వక్ఫ్ బోర్డు పేరుతో కొందరు గూండా రాజ్యం, ల్యాండ్ జిహాద్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మంచి వాతావరణం వచ్చింది, ప్రధాని మోదీ మంచి నిర్ణయం తీసుకుని 14 మార్పులు కూడా చేశారన్నారు. చంద్రబాబు, నీతీష్‌కుమార్ ఎన్ని సంవత్సరాలు మీరు సీఎంగా ఉంటారు.. పది, ఇరవై, ముప్పై, యాబై.... దాని తర్వాత ప్రతీ ఒక్కరూ ఈ భూమి విడిచి వెళ్లాల్సిందే.
వక్ఫ్‌బోర్డుకు ఒక బిల్లుకు మద్దతు తెలిపి భవిష్యత్తులో మన పిల్లలు యాద్ చేసుకునే విధంగా మిగిలిపోవాలన్నారు. వక్ఫ్‌బోర్డు పేరిట ల్యాండ్ కబ్జా చేయాలి అనే చట్టాన్ని మా పెద్దోళ్లు మార్పులు చేశారనే మంచి పేరు సంపాందించుకోవాలని, ఆ పేరు రావాలంటే ఎలాంటి షరతులు లేకుండా టీడీపీ, జేడీయూ పార్టీలు వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వాలని వీడియోలో విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!
ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు
Read Latest Telangana News and National News

దారుణం.. ట్రైన్ వాష్‌రూమ్‌లో బాలికపై

హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు..

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి పేరు ఖరారు

ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు

పనిచేసేది హోంగార్డుగా.. గ్రూపు-4లో ఉద్యోగం ఇప్పిస్తానని..
