Share News

Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్..

ABN , Publish Date - Apr 01 , 2025 | 06:38 AM

దేశవ్యాప్తంగా బంగారం ధర స్వల్ప ఊరటనిస్తోంది. కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పసిడి రేటు మూడ్రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే భవిష్యత్తులో మాత్రం మరింతగా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్..
Gold and Silver Prices

బిజినెస్ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్లు, రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు వస్తుంటాయి. అయితే కొన్ని నెలలుగా కొండెక్కిన గోల్డ్ ధర మూడ్రోజులుగా స్వల్ప తేడాలతో యథావిధిగా కొనసాగుతోంది. ఇది పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. ఇవాళ (01-04-2025) ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,602 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.89,020కు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.81,739 కాగా.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.89,170 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి రేటు యథావిధిగా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.81,868 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.89,310 వద్ద కొనసాగుతోంది.


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధర పరిస్థితి ఇది..

  • కోల్‌కతా- రూ.81,629, రూ.89,050

  • చెన్నై- రూ.81,978, రూ.89,430

  • కోయంబత్తూర్- రూ.81,978, రూ.89,430

  • బెంగళూరు- రూ.81,803, రూ.89,240

  • పుణె- రూ.81,739, రూ.89,170

  • అహ్మదాబాద్- రూ.81,849, రూ.89,290

  • భువనేశ్వర్- రూ.81,758, రూ.89,190

  • భోపాల్- రూ.81,831, రూ.89,270

  • పట్నా- రూ.81,693, రూ.89,120

  • సూరత్- రూ.81,849, రూ.89,290


వెండి ధర ఎలా ఉందంటే..

ఇక వెండి విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం 06:30 గంటల సమయానికి కిలో వెండి ధర రూ.1,00,410 ఉండగా.. మంగళవారం ఉదయానికి రూ.99,940కి తగ్గింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిన్న రూ.1,00,590 ఉన్న కేజీ వెండి ధర.. ఇవాళ ఉదయానికి రూ.1,00,110కి పడిపోయింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో సోమవారం కిలో వెండి రూ.1,00,740 ఉండగా.. మంగళవారానికి రూ.1,00,270కి తగ్గుముఖం పట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి:

డిసెంబరు నాటికి విదేశీ అప్పులు రూ.61.38 లక్షల కోట్లు

చిన్న షేర్లదే హవా

Updated Date - Apr 01 , 2025 | 06:54 AM