Viral Video:ఎంత జలసీగా ఫీల్ అయితే మాత్రం.. కండలూడేలా కొరకాలా..
ABN , Publish Date - Apr 01 , 2025 | 06:57 AM
Viral Video: మనుషులకే కాదు కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మనం ఎంత ప్రేమ చూపిస్తామో అవి అంతకు పది రెట్లు ప్రేమ చూపిస్తాయి. కొన్ని సార్లు వాటి జెలసీ కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది.

మనుషులకే కాదు.. జంతువులకు కూడా జెలసీ ఉంటుంది. మరీ ముఖ్యంగా కుక్కలకు జెలసీ పీక్స్‌లో ఉంటుంది. మనం పట్టించుకోకపోతే అవి బాధపడతాయి. ఒక్కోసారి కోపంతో మన మీద దాడి కూడా చేస్తాయి. తాజాగా, ఓ వ్యక్తి కుక్క జెలసీ కారణంగా దారుణంగా గాయపడ్డాడు. ఓ కుక్క అతడ్ని కండ ఊడేలా కొరికింది. పాపం ఓ నిమిషం పాటు కుక్క దెబ్బకు గిలగిల్లాడాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ సెక్యురీటీ గార్డు రాత్రి పూట ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అక్కడ ఇంటి బయట కొన్ని కుక్కలు ఉన్నాయి.
ఇంటి గేటు ముందు పడుకుని ఉన్న తెల్లకుక్కను ఆ వ్యక్తి చేరదీశాడు. కిందకూర్చుని దాన్ని ముద్దు చేశాడు. ఇంతలో రోడ్డు మీద ఉన్న ఓ ఎర్ర కుక్క అతడి దగ్గరకు వచ్చింది. వచ్చీ రాగానే అతడ్ని కరిచింది. ఈ హఠాత్పరిణామానికి అతడు షాక్ అయ్యాడు. తెల్ల కుక్కను వదిలేసి కరిచిన కుక్కను టప్‌మని కొట్టాడు. అతడు కొట్టినా అది పక్కకు వెళ్లలేదు. అతడి మీద దాడి చేయటం మొదలెట్టింది. దాని నోరు పట్టుకుని కొంచెం సేపు నేలపై ఆనించాడు. చెయ్యి తీసిన ప్రతీసారి అది కరవడానికి రాసాగింది. గట్టిగా అతడి చేతిని కరిచి పట్టుకుంది. అతడు కిందా మీద పడినా వదల్లేదు. ఎలాగైతేనేం.. దాన్ని విసిరి కొట్టాడు.
పక్కకు వెళ్లిపోయింది. అతడు బతుకు జీవుడా అనుకుంటూ చేతికయిన గాయాన్ని చూసుకుంటూ అక్కడినుంచి ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలీదు. కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘ కుక్కలతో మరీ అంత ప్రేమగా ఉండకూడదు’..‘ వీడియో చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. చాలా భయంకరంగా ఉంది’...‘ దేశంలో రోజు రోజుకు వీధికుక్కల బెడద ఎక్కువయిపోతోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వృద్ధురాలిని చంపేసిన పిట్‌బుల్
2022లో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. లక్నోకు చెందిన ఓ వృద్ధురాలిని పెంపుడు పిట్‌బుల్ చంపేసింది. సుశీల త్రిపాఠి అనే 82 ఏళ్ల వృద్ధురాలు స్కూల్లో టీచర్‌గా పనిచేసి రిటైర్డ్ అయింది. కొడుకుతో కలిసి ఇంట్లో ఉంటోంది. ఆ కొడుకు పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు. కొడుకు ఇంట్లో లేని సమయంలో కుక్క ఆమెపై దాడి చేసింది. విచక్షణా రహితంగా కొరికేసింది. కొడుకు ఇంటికి వచ్చే సరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
ఇవి కూడా చదవండి:
Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్..
Myanmar Crisis Deepens: మయన్మార్‌పై మరో పిడుగు