Share News

Halwa Ceremony: బడ్జెట్ సమయంలో హల్వా వేడుక ఏంటి.. అసలేంటీ చరిత్ర..

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:53 PM

కేంద్ర బడ్జెట్‌ 2024ను(budget 2024) మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే దీనికి ముందు ఇటివల ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను(halwa ceremony) నిర్వహించింది. అయితే అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు. అసలేంటి చరిత్ర అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Halwa Ceremony: బడ్జెట్ సమయంలో హల్వా వేడుక ఏంటి.. అసలేంటీ చరిత్ర..
halwa ceremony

కేంద్ర బడ్జెట్‌ 2024ను(budget 2024) మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే దీనికి ముందు ఇటివల ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను(halwa ceremony) నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొ్ని ఉన్నతాధికారులందరికీ హల్వాను పంపిణీ చేసి నోళ్లను తీపి చేశారు. అయితే అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు. అసలేంటి చరిత్ర అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


లీక్‌లతో ఆర్థిక మంత్రి

బ్రిటిష్ వారు 1860 నుంచి దేశంలో బడ్జెట్‌(budget)ను సమర్పించడం ప్రారంభించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత మొదటి బడ్జెట్ 1950లో సమర్పించబడింది. అప్పుడు జాన్ మథాయ్ ఆర్థిక మంత్రి. ఆ క్రమంలో 1950లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టకముందే అందులోని కొన్ని భాగాలు లీక్ అయ్యాయి. లీక్‌తో అప్పటి ఆర్థిక మంత్రి జాన్‌ మత్తాయ్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బడ్జెట్‌ ప్రింటింగ్‌ను రాష్ట్రపతి భవన్‌లోని ప్రెస్‌ నుంచి మింటో రోడ్డులోని ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు.


హల్వా వేడుక ప్రారంభం

ఆ తర్వాత 1980వ దశకంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ ప్రింటింగ్ కోసం సొంత ముద్రణ యంత్రాన్ని మంత్రిత్వ శాఖ నేలమాళిగలో ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో దానిని సిద్ధం చేసే వ్యక్తులు మంత్రివర్గంలోనే ఉండి బడ్జెట్‌ను సిద్ధం చేయాలని సూచించారు. దీనికి ముందు హల్వా తయారీ కార్యక్రమం జరిగింది. అప్పుడు బడ్జెట్ సిద్ధం చేయడానికి అధికారులు సరిగ్గా 9-10 రోజులు ఎవరితో సంబంధం లేకుండా ఉంటారు.


అధికారులు, సిబ్బంది

హల్వా వేడుకలో అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి గోప్యత. వేడుక ముగిసిన తర్వాత, బడ్జెట్ తయారీ ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పించే వరకు వారి కార్యాలయాలకే పరిమితమవుతారు. ఈ సమయంలో వారికి మిగతా వారితో ఎలాంటి సంబంధాలు ఉండవు. నో ఫోన్ కాల్స్, అధికారులు బయటకు వెళ్లడానికి అనుమతించబడరు. CCTV కెమెరాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల నిఘాలు ఉంటారు. ఇది ప్రధానంగా గోప్యతను నిర్వహించడానికి, బడ్జెట్ ప్రతిపాదనలు లీక్‌ కాకుండా ఉండేందుకు ఇలా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.


అప్పటి నుంచి..

నాటి నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు, వారి సహాయక సిబ్బంది కోసం అన్ని ఏర్పాట్లు అక్కడే ఉంటాయి. హల్వా వేడుక ముగిసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఆ అధికారులకు బయటి వ్యక్తులతో కంటాక్ట్ ఉండదు. 1980 నుంచి 2020 వరకు 40 ఏళ్ల పాటు బడ్జెట్ పత్రాలను ముద్రించడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే ప్రింటింగ్ ప్రెస్ ఉపయోగించారు. ఆ తర్వాత బడ్జెట్ డిజిటల్‌గా మారింది. కొన్ని పత్రాలు మాత్రమే ముద్రించబడున్నాయి. డిజిటల్‌గా మారడం వల్ల లాక్ ఇన్ వ్యవధి దాదాపు 2 వారాల నుంచి 8 రోజులకు తగ్గించబడింది.


హల్వా కథ

కొలీన్ టేలర్ సేన్ తన 'ఫీస్ట్స్ అండ్ ఫాస్ట్స్' అనే పుస్తకంలో 13వ శతాబ్దం ప్రారంభం నుంచి 16వ శతాబ్దం మధ్యకాలం వరకు ఢిల్లీ సుల్తానేట్ కాలంలో హల్వా భారతదేశానికి వచ్చిందని రాశారు. హల్వా అరబిక్ దేశం నుంచి పర్షియా మీదుగా భారతదేశానికి వచ్చిందని ‘గుజిష్ట లక్నో’ పుస్తకంలో కూడా చెప్పబడింది. హైదరాబాద్‌లో జౌజీ హల్వాను విక్రయించే హమీది మిఠాయిలు టర్కీకి లింక్‌లు కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఎందుకంటే ఆ దుకాణాన్ని టర్కీ సంతతికి చెందిన వారు స్థాపించారు.

హల్వా తయారీ మొదట ఒట్టోమన్ సామ్రాజ్యం టర్కియేలో జరిగిందని నమ్ముతారు. ఆ క్రమంలో సుల్తాన్ స్వీట్లు వండడానికి ప్రత్యేక వంటగదిని నిర్మించాడని చెబుతారు. ఆ సమయంలో హల్వా కేవలం మూడు పదార్థాలతో తయారు చేయబడింది. స్టార్చ్, కొవ్వు, స్వీటెనర్. ఈ వంటకం 12వ శతాబ్దానికి పూర్వం తూర్పు రోమన్ బైజాంటైన్ సామ్రాజ్యం నాటిదని చెబుతున్నారు. దాని రుచిని మెరుగుపరచడానికి ఖర్జూరం, గింజలు, ఇతర మసాలా దినుసులు కూడా ఉపయోగించబడ్డాయి.


ఇవి కూడా చదవండి:

Jobs: గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ టెక్ సంస్థలు.. త్వరలోనే 60 వేల ఉద్యోగాలు..!

Stock Markets: నేడు కూడా భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 905 పాయింట్లు ఖతం

Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!


For Latest News and Business News click here

Updated Date - Jul 19 , 2024 | 12:56 PM