Home » Harish Rao
ప్రజలను ఇబ్బందిపెట్టి ఎవరు పైశాచికానందం పొందుతున్నారు రేవంత్‌రెడ్డీ.. హైడ్రా పేర ఇళ్లను కూలగొట్టి నువ్వు పైశాచికానందం పొందావు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేయించావ్
మహిళలను కోటీశ్వరులను చేస్తామని కోతలు కోసిన రేవంత్ రెడ్డి పాలనలో వారికి మిగిలింది వేదనే అని, కనీసం లక్షాధికారులుగా కూడా చేయని చేతగాని సర్కారు ఇదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
‘‘మాది ప్రజా ప్రభుత్వమని ప్రచారం చేసుకునే భట్టి విక్రమార్క బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు సచివాలయానికి వేస్త ఎందుకు మొహం చాటేశారు? పోలీసులను అడ్డుపెట్టుకొని వెనుక గేటునుంచి ఎందుకు వెళ్లిపోయారు?
జీఎస్టీ ఆదాయంలో తక్కువ వృద్ధిరేటు, రిజిరేస్టషన్లు, వెహికిల్ టాక్స్‌లో నెగెటివ్ వృద్ధిరేటు రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యాన్ని ఎండగడుతున్నాయని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
గత ప్రభుత్వం (బీఆర్ఎస్) చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తోందని, ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామని హరీష్ రావు చెప్పారు. మేడిగడ్డలోని ఒక్క బ్లాక్‌లోని ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పై బురద జల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్‌లోకి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుపై హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.
హరీశ్ రావుపై బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీఎన్ఎస్ 351 (2), ఆర్ డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల కారణంగానే సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారేనని ధ్వజమెత్తారు.