Home » Harish Rao
రాష్ట్ర వ్యాప్తంగా కాదు.. సొంత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఉండటం ప్రజల దురదృష్టమని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
రాష్ట్రంలో దుర్మార్గ అరాచక పాలన సాగుతోందని, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
‘‘కాంగ్రెస్ ఏడాది పాలన అంతా ప్రజలను వంచించడమే సరిపోయింది. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు అందుకునే అవ్వ, తాతల వరకు.., నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరినీ వంచించింది.
మూసీ, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు ఛార్జ్ షీట్ విడుదల చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చార్జ్ షీట్ సిద్ధం చేసింది. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేస్తారు. హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని హరీష్ రావు విమర్శించారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం (ఆర్ఆర్ఆర్)లో భాగంగా తక్కువ ధరకే తమ భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని పలువురు బాధితులు ఆరోపించారు.
తమ పార్టీ నేతల అరెస్టులను నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో హరీశ్‌రావును అరెస్టు చేయరాదని.. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చని పోలీసులకు హైకోర్టు స్పష్టంచేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు ముందు, తర్వాత హైడ్రామా నెలకొంది. కౌశిక్ రెడ్డి అరెస్టును అడ్డుకొనేందుకు కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలను వచ్చినవారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాదులో మరోసారి బీఆర్ఎస్ మాజి మంత్రి హరీష్ రావును పోలీస్‌లు అరెస్ట్ చేశారు.