Supreme Court: అరెస్టుల్లో పోలీసులు హద్దులు దాటొద్దు
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:00 AM
అరెస్టుల సమయంలో పోలీసులు హద్దులు దాటొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత డీజీపీలదని తెలిపింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అరెస్టుల విషయంలో పోలీసులు హద్దులు దాటొద్దని సుప్రీంకోర్టు మరోమారు హెచ్చరించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు నిందితులకు ఉంటాయని, అరెస్టు విషయంలోనూ గౌరవమర్యాదలను పాటించాలని హితవు పలికింది. హరియాణాలో.. వరకట్న వేధింపుల కేసులో అరెస్టయిన ఓ బాధితుడి పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హరియాణా పోలీసులు తనను అరెస్టు చేసే సమయంలో.. పోలీస్‌స్టేషన్‌లో తనపై దాడి చేశారని బాధితుడు పేర్కొన్నారు. ‘‘అరెస్టు సమయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను ఈ కోర్టు ఎన్నో సందర్భాల్లో జారీ చేసింది. దాన్ని కింది స్థాయి అధికారులకు వివరించాల్సిన బాధ్యత డీజీపీదే’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్నేశ్‌కుమార్, తదితర కేసుల తీర్పులను తాజాగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు పంపింది.
ఇవి కూడా చదవండి:
AP Police Search For Kakani: హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి ఏపీ పోలీసులు..