Home » Holidays
రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబరు 2వ తేదీ నుంచి దసరా సెలవులను ప్రకటించారు. ఆ నెల 14వ తేదీ వరకు సెలవులు ఉంటాయి.
Dussehra Holidays 2024: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి. ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు రానున్నాయి. తెలుగు మాస క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.
ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని బ్రిజ్‌పూరి మదర్సాలో శుక్రవారం రాత్రి జరిగింది.
రేపు నాగుల పంచమి. ఈ పండుగను దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిర్వహిస్తారు. అయితే ఈ నేపథ్యంలో బ్యాంకులు సహా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయా అనే సందేహం కూడా అనేక మందిలో మొదలైంది.
జులై 17న(July 17th) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే(public holiday) ఉంది. అయితే ఈసారి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలోని 10వ రోజున మొహర్రం/ఆషురా పండుగను జులై 17న జరుపుకుంటారు. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలు ఈరోజున సెలవు ప్రకటించాయి. అయితే ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మాత్రం హాలిడే లేదు.
ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా జులై నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేసి(Bank Holidays in July) ఉంటాయి. ఆర్బీఐ విడుదల చేసి సెలవుల జాబితా ప్రకారం.. జులైలో రెండు, నాలుగో శనివారాలు సహా 12 రోజులపాటు బ్యాంకులు మూసి ఉంటాయి.
రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభానికి వేళయింది. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ వంటి అన్నిరకాల స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించడానికి పుస్తకాలు, యూనిఫామ్‌లను ఇప్పటికే సిద్ధం చేశారు.
అనంతపురం జిల్లా ఎన్నికల మస్కట్‌గా ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ విద్యార్థి ప్రశాంత కుమార్ రూపొందించిన ‘వేరుశనగ’ ఆకృతి ఎంపికైంది. రాష్ట్రంలోనే మొట్టమొదట ఎన్నికల మస్కట్‌ను రూపొందించిన జిల్లాగా అనంతకు ఖ్యాతి దక్కిందని కలెక్టరు వినోద్‌కుమార్ తెలిపారు. ఎన్నికల మస్కట్ ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 62 మస్కట్లు వచ్చాయి.
చిరుత సంచరిస్తుండడంతో ఓ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆణిమేరిస్వర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. మైలాడుదురై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత(Cheetah)... అరియలూరు జిల్లా పొన్‌పరప్పి, సిదలవాడి ప్రాంతాల్లో తిరుగున్నట్లు గురువారం వార్తలు రావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.