Share News

Schools Holiday: సోమవారం స్కూళ్లకు సెలవు.. కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు..

ABN , Publish Date - Aug 31 , 2024 | 09:55 PM

హైదరాబాద్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

Schools Holiday: సోమవారం స్కూళ్లకు సెలవు.. కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు..
Holiday

హైదరాబాద్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండుజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో సమీక్షీంచారు. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రభుత్వం యంత్రాంగం అలర్ట్


అప్రమత్తంగా ఉండాలని..

వర్షాల నేపథ్యంలో అవసరమైన ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని అప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల, పోలీస్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ 040-23202813, 9063423979 నెంబరుతో పాటు హైదరాబాద్ ఆర్డీవో 7416818610, 9985117660, ఆర్డీవో సికింద్రాబాద్ 8019747481 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

TGPSC: బిగ్ అలర్ట్.. వారికి మరో అవకాశం ఇచ్చిన టీజీపీఎస్‌సీ..


లోతట్టు ప్రాంతాలపై నిఘా..

లోతట్టు, వరద ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లకుండా తగిన విధంగా నిఘా పెట్టాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా ఉధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించుకునే నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలనుంచి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల వల్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్య పరచాలని సీఎస్ ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లోని తాగునీటి వనరులైన ట్యాంకులు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవడంతోపాటు, అంటూ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్‎లను చేపట్టాలని తెలిపారు. వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులను సిద్ధంగా ఉంచామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్, విజయవాడలలో ఉన్నాయని, ఏవిధమైన అవసరం ఉన్నా ముందస్తు సమాచారం ఇస్తే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృదాలను పంపిస్తామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


TG Govt: టూరిజంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Aug 31 , 2024 | 09:55 PM