Holidays In 2025: పబ్లిక్, ఆప్షనల్ హాలీడేస్ జాబితా ఇదే
ABN , Publish Date - Sep 27 , 2024 | 06:03 PM
వచ్చే ఏడాది సెలవులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ హాలీడేస్, ఆప్షనల్ హాలీడేస్ జాబితాను రిలీజ్ చేసింది. ప్రాంతాన్ని బట్టి సెలవులు మారనున్నాయి.
వచ్చే ఏడాది సెలవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఈ క్యాలండర్ వర్తిస్తోంది. గెజిటెడ్ సెలవులు తప్పనిసరిగా తీసుకుంటారు. పరిమిత లీవ్స్‌లలో కొన్ని రూల్స్ ఉంటాయి. సంస్థ, రాష్ట్రాల వారీగా ఆయా సెలవులు మారుతుంటాయి. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ 17 గెజిటెడ్ 34 ఆప్షనల్ సెలవులను ప్రకటించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీచేసింది.
పబ్లిక్ హాలీడేస్
జనవరిలో 26 రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి, మార్చి 14 హోళీ, మార్చి 31 ఈద్ ఉల్ ఫితర్, ఏప్రిల్ 10 మహావీర్ జయంతి, 18 గుడ్ ఫ్రై డే, మే 12 బుద్ద పౌర్ణిమ, జూన్ 7 బక్రీద్, జూలై 6 మొహర్రం, ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం, ఆగస్ట్ 16 జన్మాష్టమి, సెప్టెంబర్ 5 మిలాద్ ఉన్ నబీ, అక్టోబర్ 2 దసరా, 20 దీపావళి, నవంబర్ 5 గురునానక్ జయంతి, డిసెంబర్ 25 క్రిస్మస్
ఆప్షనల్ హాలీడేస్
జనవరి 1 న్యూ ఇయర్, 14 సంక్రాంతి, 16 గురు గోవింద్ సింగ్ జయంతి, ఫిబ్రవరి 2 వసంత పంచమి, 12 గురు రవీదాస్ జయంతి, 19 శివాజీ జయంతి, 23 స్వామి దయానంద స్వామి జయంతి, మార్చి 13 హోలి, 14 డోలియాత్ర, ఏప్రిల్ 16 శ్రీరామ నవమి, ఆగస్ట్ 15 జన్మాష్టమి, 27 వినాయక చవితి, సెప్టెంబర్ 5 ఓనం, 29 దసరా (సప్తమి), 30 దసరా (మహాష్టమి), అక్టోబర్ 1- దసరా (మహానవమి) 7 మహార్షి వాల్మీకి జయంతి, 10- కరక చతుర్థి, 20- నరక చతుర్థి, 22-గోవర్ధన్ పూజ, 23- భాయ్ దూజ్, 28-ప్రతిహార షష్టి, నవంబర్ 24 గురుటేక్ బహదూర్ షహీద్, డిసెంబర్ 24 క్రిస్మస్ పండగలకు ఆప్షనల్ హాలీడేస్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Viral News: హమ్ దో హమారే దో డజన్‌పై క్లారిటీ
ED Raids: పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు
KTR: హైడ్రా టార్గెట్‌గా కేటీఆర్ ఘాటు విమర్శలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.